రేపే బ్రిటన్‌ రాజుగా కింగ్‌ చార్లెస్‌ పట్టాభిషేక మహోత్సవం.. భారత ప్రతినిధిగా ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్ హాజరు

Britain King Coronation King Charles to be Crowned Tomorrow Vice President Jagdeep Dhankhar will Attend,Britain King Coronation, King Charles to be Crowned,Vice President Jagdeep Dhankhar will Attend,Coronation Of King Charles,Mango News,Mango News Telugu,Coronation latest,Coronation King Charles,Britain King Latest News And Updates,King Charles Latest News And Updates,King Charles,Britain King,King Charles should be Britains last monarch

బ్రిటన్‌ రాజుగా కింగ్‌ చార్లెస్‌-3 పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (శనివారం, మే 6, 2023) జరగనున్న ఈ వేడుకకు లండన్ లోని చారిత్రాత్మక వెస్ట్‌మిన్‌స్టర్‌ అబే చర్చి వేదిక కానుంది. ఏడో శతాబ్దంలో నిర్మించిన ఈ చర్చి బ్రిటన్‌ చరిత్రలో అనేక ముఖ్యమైన ఘట్టాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. క్వీన్‌ ఎలిజబెత్‌ వివాహం, పట్టాభిషేకం, ఆమె మరణించిన తర్వాత అంత్యక్రియలు వంటివి ఈ వెస్ట్‌ మిన్‌స్టర్‌ అబేలోనే జరగడం విశేషం. కాగా బ్రిటన్‌ను సుదీర్ఘకాలం పాలించిన క్వీన్ ఎలిజ‌బెత్-2 గతేడాది సెప్టెంబర్ 8న కన్నుమూసిన సంగతి తెలిసిందే. 96 సంవ‌త్స‌రాల క్వీన్ ఎలిజ‌బెత్-2 దాదాపు 70 ఏళ్ల పాటు ఇంగ్లండును పాలించటం విశేషం. ఎలిజబెత్-2 తన తండ్రి కింగ్ జార్జ్-6 మరణం తరువాత ఫిబ్రవరి 6, 1952న తన 25 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిష్టించింది.

ఇక ఆమె తదనంతరం ప్రోటోకాల్‌ ప్రకారం ఆమె మొదటి కుమారుడు 73 ఏళ్ల చార్లెస్-3 బ్రిటన్ సెప్టెంబరు 10న బ్రిటన్ కొత్త చక్రవర్తిగా నియమితులయ్యారు. తద్వారా చార్లెస్ భార్య కెమిల్లా క్వీన్‌ కన్సార్ట్‌గా, అతని కుమారుడు ప్రిన్స్ విలియం కొత్త ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గా లాంఛనంగా ఎంపికయ్యారు. రాజకుటుంబం సంప్రదాయం ప్రకారం, శనివారం ఉదయం, కింగ్ చార్లెస్-3 భార్య కెమిల్లాతో కలిసి ఊరేగింపుగా బకింగ్‌హామ్ ప్యాలెస్ నుండి డైమండ్ జూబ్లీ స్టేట్ కోచ్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ అబేకి వెళ్లనున్నారు. ఈ శతాబ్దంలో జరుగనున్న అత్యంత వైభవోపేత వేడుకగా దీనిని భావిస్తున్నారు. ఈ వేడుకల కోసం బ్రిటన్ ప్రభుత్వం కొన్ని వేలకోట్లు ఖర్చు చేస్తోంది. ప్రపంచదేశాల అధినేతలకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. లండన్ ప్రజలు తమ కొత్త రాజుకు స్వాగతం చెప్పేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే జరుగనున్న ఈ వేడుకకు సంబంధించి సర్వం సిద్ధమైంది.

ఇక శనివారం ఉదయం జరిగే కింగ్ చార్లెస్-3 పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత ప్రతినిధిగా ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్ హాజరు శుక్రవారమే లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రెండురోజుల యూకే పర్యటన సందర్భంగా, ఆయన పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొననున్న వివిధ దేశాధి నేతలు సహా 2,000 మంది ప్రముఖులతో కలిసి పాల్గొంటారు. కాగా ఉపరాష్ట్రపతి వెంట ఆయన సతీమణి సుదేష్ ధన్కర్ కూడా లండన్ వెళ్లారు. అయితే కింగ్‌ చార్లెస్‌ పట్టాభిషేకం కార్యక్రమానికి భారత్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం అందగా ఆమె బదులు ఉప రాష్ట్రపతి హాజరవుతున్నారు. ఇక గతేడాది సెప్టెంబరులో నిర్వహించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =