కీలక నిర్ణయం తీసుకున్న ఇరాన్

Visa free entry for Indians Iran decision,Visa free entry for Indians,Indians Iran decision,free entry for Indians,Iran, Visa free entry for Indians, Iran decision,Russia United Arab Emirates, Japan, Singapore, Malaysia, Brazil, Peru, Bahrain, Saudi Arabia, China, Qatar, Kuwait, Lebanon,Mango News,Mango News Telugu,Iran decision Latest News,Iran decision Latest Updates,Visa free entry Latest News
Iran, Visa free entry for Indians, Iran decision,Russia United Arab Emirates, Japan, Singapore, Malaysia, Brazil, Peru, Bahrain, Saudi Arabia, China, Qatar, Kuwait, Lebanon,

కొద్ది రోజులుగా కొన్ని దేశాలు భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ అవకాశాన్ని కల్పిస్తున్నాయి.  తాజాగా  ఇరాన్ కూడా భారతీయ టూరిస్టులకు అదే గుడ్ న్యూస్ చెప్పింది. అవును తమ దేశానికి వచ్చే భారతీయ టూరిస్టులకు వీసా ఫ్రీ ఎంట్రీని కల్పిస్తూ ఆ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. భారతదేశం నుంచి వచ్చే పర్యాటకులకు వీసా కండిషన్లను ఏకపక్షంగా రద్దు చేయడానికి ఇరాన్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ఇరాన్ సాంస్కృతిక వారసత్వం, పర్యాటక మంత్రి ఎజ్జతోల్లా తాజాగా  జర్ఘామి ప్రకటించారు.

భారత దేశంతో సహా  ఇంకో 33 దేశాలకు కూడా  వీసా నిబంధనలను రద్దు చేస్తూ ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. టూరిస్టుల ద్వారా  ఎక్కువ ఆదాయం వస్తుందన్న విషయాన్ని గ్రహించిన ఇరాన్.. ఇప్పుడు సందర్శకులను పెంచడంతో పాటు, ప్రపంచదేశాల నుంచి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు  టూరిస్ట్ మినిస్టర్ వెల్లడిచారు.

భారత్‌తో పాటు రష్యా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,జపాన్, సింగపూర్, మలేషియా , బ్రెజిల్, పెరూ, బహ్రెయిన్, సౌదీ అరేబియా,చైనా, ఖతార్, కువైట్, లెబనాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, బోస్నియా , హెర్జెగోవినా, సెర్బియా,  ట్యునీషియా, మౌరిటానియా, టాంజానియా, జింబాబ్వే, మారిషస్, సీషెల్స్, ఇండోనేషియా, దారుస్సలాం,  కాంబోడియా,  క్యూబా, మెక్సికో, వెనిజులా, క్రొయేషియా, బెలారస్ దేశాలకు ఈ సౌకర్యాన్ని కల్పించింది. దీనికి ముందు టర్కీ, అజర్ బైజాన్, ఒమన్, ఆర్మేనియా, లెబనాన్, సిరియా దేశాల పర్యాటకులకు వీసా మినహాయింపు ఉంది.

ఇప్పటి వరకూ భారతదేశం నుంచి దౌత్య వ్యవహారాల కోసం ఇరాన్ వెళ్తున్న వారికి మాత్రమే.. వీసా అనుమతి నుంచి మినహాయింపు ఉండేది. కానీ ఇకమీదట ఈ జాబితాలోకి  పర్యాటకులను కూడా  చేర్చింది. అలా శ్రీలంక, మలేషియా, థాయ్ లాండ్, కెన్యా వంటి దేశాలు ఇప్పటికే భారతీయ టూరిస్టులకు వీసా ఫ్రీ ఎంట్రీని కల్పించగా.. తాజాగా ఇరాన్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుని గుడ్ నూస్ వినిపించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − fifteen =