సీబీఎస్‌ఈ : 9 నుంచి 12 వ తరగతుల వరకు 30 శాతం సిలబస్ తగ్గింపు

CBSE Decides to Cut 30% Syllabus, CBSE Decides to Cut 30% Syllabus for 9-12 Classes, CBSE Portions Reduced, CBSE reduces syllabus by up to 30%, CBSE Syllabus, CBSE syllabus cut by 30 percent, CBSE to reduce syllabus by 30%

దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గానూ సీబీఎస్‌ఈకి సంబంధించి 9 నుంచి 12 వ తరగతుల వరకు 30 శాతం సిలబస్ ను తగ్గిస్తున్నట్టు కేంద్రహెఛ్ఆర్డీ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ఈ రోజు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

“దేశంలో మరియు ప్రపంచంలో కరోనా వలన ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా పాఠ్యాంశాలను సవరించాలని, అలాగే 9 వ తరగతి నుండి 12 వ తరగతి విద్యార్థులకు సిలబస్ ను తగ్గించాలని సీబీఎస్‌ఈ సూచించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు కొన్ని వారాల క్రితం సిలబస్ తగ్గింపుపై విద్యావేత్తల నుండి సలహాలను ఆహ్వానించాము. 1500 మందికి పైగా ఈ అంశంపై స్పందించి సూచనలు చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అభ్యాస సాధన యొక్క ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, పాఠ్యాంశాలలో ప్రధాన అంశాలను అలాగే ఉంచడం ద్వారా సిలబస్‌ను 30% వరకు తగ్గించాలని నిర్ణయించామని” మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − thirteen =