ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లకు కేంద్రం నోటీసులు

Amazon, Amazon News, Centre issues notice to Amazon, Centre issues notice to E-commerce giants, Centre Issues Notices to Amazon Flipkart, Flipkart, Flipkart Showing Products without Mandatory Information, Govt issues notices to Amazon, Govt issues notices to Flipkart, national news, Notices to Amazon

దసరా, దీపావళి పండుగ సీజన్‌ నేపథ్యంలో గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్స్ పేరుతో అమెజాన్, ది బిగ్‌ బిలియన్‌ డేస్‌ పేరుతో ఫ్లిప్‌కార్ట్ సంస్థలు కస్టమర్లకు భారీ ఆఫర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లకు కేంద్రప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సేల్స్ సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచిన వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయి(కంట్రీ ఆఫ్ ఆర్జిన్), మరియు ఇతర సంబంధిత విషయాలు తెలిపే సమాచారం బహిర్గతం చేయకపోవడంపై కేంద్రం స్పందించింది. ఈ అంశంపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఈ రెండు ఈ-కామర్స్‌ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై స్పందించేందుకు 15 రోజుల సమయం ఇచ్చారు. మరోవైపు అన్ని ఈ-కామర్స్ సంస్థలు నిబంధనలను పాటించేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =