కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారం

Congress Leader Siddaramaiah Takes Oath as Chief Minister and KPCC Chief DK Shivakumar Sworn in as Deputy CM of Karnataka,Congress Leader Siddaramaiah Takes Oath as Chief Minister,Siddaramaiah Takes Oath as Chief Minister,KPCC Chief DK Shivakumar,DK Shivakumar Sworn in as Deputy CM,KPCC Chief DK Shivakumar as Deputy CM of Karnataka,Mango News,Mango News Telugu,Siddaramaiah,DK Shivakumar,Congress Leader Siddaramaiah,Congress Leader Siddaramaiah Latest News,Congress Leader Siddaramaiah Latest Updates,KPCC Chief DK Shivakumar Latest News,KPCC Chief DK Shivakumar Latest Updates,Congress's Show Of Strength At Karnataka,Karnataka Politics Live

కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్ గెహ్లాట్‌ వారి చేత ప్రమాణస్వీకారం చేయించారు. అలాగే కర్ణాటక మంత్రులుగా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. జి. పరమేశ్వర(దళిత), కేహెచ్‌ మునియప్ప(దళిత), కేజే జార్జ్(క్రిష్టియన్), ఎంబీ పాటిల్(లింగాయత్), సతీష్ జార్కలి(ఎస్టీ), జమీర్ అహ్మద్(ముస్లిం మైనార్టీ), రామలింగా రెడ్డి(రెడ్డి), సతీష్ జార్కిహోలి(ఎస్టీ) తదితరులు కొత్తగా ఎన్నికైన కర్ణాటక ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా సిద్ధరామయ్య రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. 2013లో సిద్ధరామయ్య తొలిసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 136 అసెంబ్లీ స్థానాలు దక్కడంతో అధిష్టానం సిద్ధరామయ్యకు మరోసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది.

శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు హాజరయ్యారు. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, వివిధ విపక్ష పార్టీల నేతలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేశ్ భాఘేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా, తమిళ నటుడు కమల్‌హాసన్ తదితరులు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరైన వారిలో ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =