కో-విన్‌ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్: నేడు, రేపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ నిలిపివేత

Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid vaccination in India, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccination Not scheduled, Covid-19 Vaccination Not scheduled For 2 days, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, India Covid Vaccination, Mango News, Upgradation of Co-Win1.0 to Co-Win 2.0, Vaccine Distribution

దేశంలో జనవరి 16 న ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. అలాగే రెండోదశలో మార్చి 1 వ తేదీ నుండి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడినవారికి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేపట్టనున్నట్టు కేంద్రప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండోదశ కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభానికి ముందు రెండు రోజుల పాటుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిలిపివేస్తున్నారు.

ఫిబ్రవరి 27, శనివారం మరియు ఫిబ్రవరి 28, ఆదివారం నాడు కరోనా వ్యాక్సిన్ పంపిణీలో కీలకంగా ఉపయోగిస్తున్న కో-విన్‌ డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ను కో-విన్‌ 1.0 నుంచి కో-విన్‌ 2.0కు ఆధునీకరిస్తున్నారు. అందువలన ఈ రెండు రోజులు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం నాడు వెల్లడించింది. కో-విన్ అప్‌గ్రేడ్/‌సాంకేతికత మార్పు గురించి రాష్ట్రాలు/కేంద్ర పాలితప్రాంతాలకు కేంద్రప్రభుత్వం ఇప్పటికే సమాచారం అందించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 12 =