దేశంలో రేపు 700 కు పైగా జిల్లాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహణ

Coronavirus Vaccine Dry Run, Coronavirus Vaccine Dry Run In India, COVID 19 Vaccine, COVID 19 Vaccine Dry Run News, COVID 19 Vaccine Dry Run Updates, Covid-19 Vaccination Dry run, Covid-19 Vaccine Dry Run, COVID-19 Vaccine Dry Run Details, COVID-19 Vaccine Dry Run to be Conducted in All States, Dry Run For Covid-19 Vaccine, India Coronavirus Vaccine Dry Run, Mango News, Nationwide COVID 19 Vaccine Dry Run, Vaccine Dry Run

దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ సజావుగా ఎలాంటి సమస్యలు లేకుండా అమలయ్యేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటికే కీలక సూచనలు చేసింది. కొవాక్సీన్, కోవిషిల్డ్ వాక్సిన్ లకు అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీసీఐజీ) ఇటీవలే అనుమతులు మంజూరు చేయడంతో త్వరలోనే కరోనా వాక్సిన్ పంపిణీ మొదలుకానుంది. పంపిణీ కార్యక్రమం అమలు చేయడంలో యంత్రాంగం సమర్ధత తెలుసుకునేందుకు ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ (వ్యాక్సిన్ సన్నాహక కార్యక్రమం లేదా వ్యాక్సిన్ మాక్ డ్రిల్) నిర్వహించారు.

700 పైగా జిల్లాల్లో 8 వ తేదీన మాక్ డ్రిల్:

ఈ నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయిల్లో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు జనవరి 8, శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా మరోసారి మాక్ డ్రిల్ ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కలిపి 700 పైగా జిల్లాల్లో 8 వ తేదీన మాక్ డ్రిల్ ను నిర్వహిస్తారు. కాగా ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో మాత్రం జనవరి 5, 7 తేదీలలోనే మాక్ డ్రిల్ ను నిర్వహించినట్టు తెలిపారు. ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని మూడు ప్రాంతాల్లో చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రజా ఆరోగ్య కేంద్రం (జిల్లా ఆసుపత్రి/వైద్య కళాశాల), ఒక ప్రైవేట్ ఆరోగ్య కేంద్రం మరియు గ్రామీణ లేదా పట్టణ కేంద్రంలో నిర్వహిస్తారని చెప్పారు. డ్రైరన్ జరిగే రోజున రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ సమాచారం ఆధారంగా సమస్యలను పరిష్కరించి కార్యక్రమం సజావుగా సాగేలా చూస్తుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =