మీరు పనిచేసే చోట ఫారం 16 ఇవ్వలేదా? అది లేకుండానే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయోచ్చట..

How To File Income Tax Return Without Form 16 Heres Know The Full Details,How To File Income Tax Return,Income Tax Return Without Form 16,Know The Full Details to File Income Tax Return,File Income Tax Return Without Form 16,Mango News,Mango News Telugu,Full Details To File Return Without Form 16,Income Tax Department,Income Tax Portal,Deduction of tax at source,Income tax returns, without Form 16,Income tax returns Latest News,File Income Tax Return News Today,File Income Tax Return Latest Updates

ఫైనాన్షియల్ ఇయర్ వచ్చిందంటేనే ట్యాక్స్ పేయర్స్ అలర్ట్ అవ్వాలి. లేదంటే జీతాలలో భారీ కోతలు, ఇతర ఆదాయాలలో ట్యాక్స్ కటింగ్స్ ఉసూరమని అనిపిస్తాయి. ఏడాది కష్టమంతా పన్నుల రూపంలోనే పోతాయి. అందుకే కాస్త ముందుగానే అన్నీ సబ్మిట్ చేసుకుంటే మనకు రావాల్సిన రిటర్న్స్ మనం తిరిగి పొందగలం. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడానికి లాస్ట్ డేట్ జులై 31. ఇప్పటికే దాదాపు 2.22 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేసినట్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ వెల్లడించింది. దీనికి కంపెనీ వాళ్లిచ్చే ఫారం 16 ఉండాలి. కానీ ఫారం 16 లేకుండానే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయోచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ట్యాక్స్ పరిమితికి మించి ఆదాయం ఉండి, ట్యాక్స్ సోర్స్‌ వద్ద డిడక్షన్ విధించినప్పుడు కంపెనీలు.. ఫారం 16ను జారీ చేస్తాయి. కంపెనీలో చేసేవాళ్లయితే ఇవి ఇస్తారు. కానీ చాలామందికి ఈ ఫారాలు ఎలా పొందాలో తెలియదు. ఇలాంటివాళ్లు కూడా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన జీతం, చెల్లించిన పన్ను వివరాలతో ఫారం 16 ను జారీ చేస్తారు. పన్ను పరిమితికి తక్కువగా ఆదాయం ఉన్నప్పుడు ఈ ఫారం ఉండదు. మరికొన్నిసార్లు కంపెనీ యాజమాన్యం నుంచి ఇంకా ఈ ఫారం అందకపోవచ్చు. ఇలాంటప్పుడు 2022-23 ఆర్థిక సంవత్సరంలో మీకు వచ్చిన జీతానికి సంబంధించిన వివరాలు ఒక చోట రాసుకోండి. తర్వాత మీ శాలరీ పే స్లిప్పులు లేదా బ్యాంకు ఖాతా వివరాలను కూడా పరిశీలించండి.

మీకు వచ్చిన టోటల్ ఆదాయం ఎంతో లెక్క చూడండి. జీతాల వివరాల్లో ఫ్యూచర్ ఫండ్‌లో జమ చేసిన మొత్తం, హెచ్‌ఆర్‌ఏ, ఆఫీసు నుంచి తీసుకున్న పర్సనల్ లోన్ వంటి వివరాలు ఉంటాయి. వీటన్నింటినీ మినహాయింపుల కింద చూపించుకోవచ్చు.అలాగే శాలరీ కాకుండా వేరే ఇతర మార్గాల నుంచి అంటే అద్దె ద్వారా, డబ్బుల వడ్డీ ద్వారా ఇలా ఏదైనా ఇన్కమ్ వచ్చిందా అని చూసుకోవాలి. అలాగే సేవింగ్స్ అకౌంట్స్ వడ్డీ, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ, డివిడెండ్ల లాంటివి ఉన్నాయా లేదా అని కూడా తెలుసుకోవాలి.

ఆ తర్వాత ఆదాయపు పన్ను పోర్టల్‌ కు వెళ్లి.. ఫారం 16, ఏఐఎస్‌ను అందుబాటులో ఉంటే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అందులో ఉన్న సమాచారంతో మీ దగ్గరున్న వివరాలను సరిపోల్చుకుని.. ఆ తర్వాత రిటర్నులు దాఖలు చేయొచ్చు. డిడక్షన్స్ పోను పన్ను వర్తించే ఆదాయం లేకపోయినా కూడా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చు. అయితే ఇన్ని చేసినా కూడా అవన్నీ కరక్టుగా ఉన్నా కూడా.. పాన్, ఆధార్ ఇప్పటి వరకూ లింక్ చేయకపోతే వారికి ట్యాక్స్ రిఫండ్ రాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇదే విషయాన్ని మరోసారి ఆదాయపు పన్ను శాఖ గుర్తు చేసింది. అయితే ఒకవేళ ఇప్పటికీ కూడా ఆధార్ ,పాన్ లింక్ చేయకపోతే.. సెక్షన్‌ 234 హెచ్‌ కింద నిర్దేశిత రుసుమును చెల్లించి.. ఈ రెండింటినీ లింక్ చేసుకోవాలని కోరింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fourteen =