వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్‌ అజయ్ బంగా.. నామినేట్ చేసిన అమెరికా అధ్యక్షుడు బైడెన్

Ex Mastercard CEO Ajay Banga Nominated by US President Joe Biden To Lead World Bank, Ex Mastercard CEO Ajay Banga, Ajay Banga Nominated by US President, Ajay Banga To Lead World Bank, Ajay Banga Nominated by Joe Biden, Mango News, Mango News Telugu, Ajay Banga Net Worth,Ajay Banga Daughter,Ajay Banga Linkedin,Ajay Banga Salary,Ajay Banga Wife,Ceo Ajay Banga,Ceo Salary In Bangalore,Mastercard Ceo Ajay Banga,Mastercard Ceo Ajay Banga Linkedin,Mastercard Ceo Ajay Banga Net Worth,Mastercard Ceo Ajay Banga Salary,Mastercard Ceo Before Ajay Banga,Ritu Banga,What Does The World Bank Do,World Bank Ceo,World Bank Data,World Bank Data Gdp,World Bank Indicators,World Bank Members,World Bank President 2023,World Bank Subsidiaries

ప్రపంచవ్యాప్తంగా అనేక దిగ్గజ సంస్థలకు పలువురు భారతీయులు సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే తాజాగా, మరో భారతీయుడు ప్రతిష్టాత్మక పదవిని దక్కించుకోనున్నాడు. వరల్డ్ బ్యాంకు అధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన వ్యక్తి, మాస్టర్‌కార్డ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజయ్ బంగాకు అవకాశం దక్కింది. ఈ మేరకు అజయ్ బంగాను వరల్డ్ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం ప్రకటించారు. కాగా ప్రస్తుత చీఫ్‌ డేవిడ్‌ మాల్‌పాస్‌ ముందస్తుగా పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా.. ‘వాతావరణ మార్పులతో సహా మన కాలంలోని అత్యంత అత్యవసర సవాళ్లను పరిష్కరించడానికి పబ్లిక్-ప్రైవేట్ వనరులను సమీకరించడంలో బంగాకు క్లిష్టమైన అనుభవం ఉంది’ అని బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా 63 ఏళ్ల ఈ భారతీయ-అమెరికన్ ప్రస్తుతం ప్రముఖ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన మాస్టర్ కార్డ్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ప్రస్తుత ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ మాల్పాస్ 2019లో అప్పటి అమెరికా డొనాల్డ్ ట్రంప్ చేత ఈ పదవికి నామినేట్ చేయబడ్డారు. వాస్తవానికి ఆయన పదవీకాలం 2024 చివరిలో ముగియాల్సి ఉండగా, దాదాపు ఏడాదిన్నర ముందే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించేందుకు అజయ్ బంగా సిద్ధమయ్యారు. ఇక ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు సాధారణంగా అమెరికన్ అయితే, అంతర్జాతీయ ద్రవ్య నిధి నాయకుడు యూరోపియన్ వ్యక్తి ఉండటం సంప్రదాయంగా వస్తోంది. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచ బ్యాంక్ యొక్క అతిపెద్ద వాటాదారుగా ఉన్న విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 7 =