ఒడిశాలో ప్రారంభమైన పురుషుల హాకీ ప్రపంచ కప్, హాజరైన కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, సీఎం నవీన్‌ పట్నాయక్‌

FIH Men's Hockey World Cup 2023 Starts With A Grand Opening Ceremony in Barabati Stadium at Cuttack Odisha,FIH Men's Hockey World Cup 2023,Men's Hockey World Cup 2023,Grand Opening Ceremony,Barabati Stadium at Cuttack Odisha,Barabati Stadium Latest News and Updates,Mango News,Mango News Telugu,Hockey World Cup 2023 Schedule,Hockey World Cup 2023 Tickets,Hockey World Cup 2023 Schedule Pdf,Hockey World Cup 2023 Venue,Hockey World Cup 2023 Teams,Hockey World Cup Winners List,Fih Men'S Hockey World Cup 2023,Fih Men'S Hockey World Cup,2023 Men'S Fih Hockey World Cup Teams,2023 Men'S Fih Hockey World Cup,Men'S Hockey World Cup 2019 Winner

క్రీడాభిమానులు అలరించడానికి మరో ప్రపంచ కప్‌కు తెరలేచింది. ఈసారి పురుషుల హాకీ ప్రపంచ కప్‌ అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా ఒడిశాలోని కటక్‌లోని బారాబతి స్టేడియంలో వేలాదిగా హాజరైన హాకీ అభిమానుల కేరింతల మధ్య గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో ప్రారంభమైంది. బుధవారం అట్టహాసంగా ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, ఇంటర్నేషనల్‌ హాకీ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ తయ్యబ్‌ ఇక్రమ్‌, హాకీ ఇండియా ఛైర్మన్‌ దిలీప్‌ టిర్కీలు పాల్గొన్నారు. కాగా ఒడిశా హాకీ వరల్డ్‌ కప్‌ నిర్వహించడం ఇది వరుసగా రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు 2018లో జరిగిన మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. ఒడిశా రాష్ట్ర ఆదివాసీ నృత్యంతో ప్రారంభమైన ఈ సెర్మనీ దాదాపు నాలుగు గంటల పాటు సాగింది. ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ శశి ప్రీతమ్‌ ఈ హాకీ వరల్డ్‌కప్‌ థీమ్‌ సాంగ్‌ కంపోజ్‌ చేయగా.. ఒడిశా సింగర్స్‌ స్నితి మిశ్రా, రితురాజ్‌ మొహంతి, లీసా మిశ్రాలు ఆలపించారు.

ఇక ఈనెల 13 నుంచి 29 వరకు జరుగనున్న ఈ మెగా టోర్నీకి ఒడిశాలోని రెండు స్టేడియాలు వేదిక కానున్నాయి. భువనేశ్వర్‌లోని కలింగ స్టేడియంతో పాటు రూర్కెలాలో కొత్తగా నిర్మించిన బిర్సా ముండా స్టేడియంలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. రూర్కెలాలో 20 మ్యాచ్‌లు, భువనేశ్వర్‌లో 24 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఒడిశా ప్రభుత్వం ఈ వరల్డ్‌ కప్‌ కోసమే రూర్కెలాలో అతి తక్కువ సమయంలోనే కొత్త స్టేడియం నిర్మించడం విశేషం. ఇక ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు బరిలో దిగుతుండగా.. మొత్తం 44 మ్యాచ్‌లు జరుగనున్నాయి. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో అర్జెంటీనా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే తొలి పోరుతో ప్రపంచ కప్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత్‌ జనవరి 13న తన తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌తో తలపడనుంది. అయితే భారత్‌ బలమైన స్పెయిన్‌, ఇంగ్లండ్‌ జట్లతో కూడిన గ్రూప్‌ ‘డి’లో బరిలో ఉండటంతో క్వాలిఫయింగ్‌ రౌండ్‌ చేరాలంటే చెమటోడ్చాల్సిందే. కాగా టోర్నీలో బెల్జియం, జర్మనీ, నెదర్లాండ్స్‌ మరియు ఆస్ట్రేలియా జట్లు టైటిల్ రేసులో ముందున్నాయి.

పురుషుల హాకీ ప్రపంచ కప్ పూర్తి షెడ్యూల్ ఇదే..

గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =