నేడు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నూతన కలెక్టరేట్లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

CM KCR will Inaugurate New Collectorates in Mahabubabad and Bhadradri Kothagudem Districts Today,KCR will Inaugurate New Collectorates,KCR Inaugurate New Collectorates,New Collectorates in Mahabubabad,New Collectorates in Bhadradri,New Collectorates in Kothagudem,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు (జనవరి 12, గురువారం) మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రెండు జిల్లాల్లో రాష్ట్రప్రభుత్వం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఉదయం మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ను ప్రారంభించిన అనంతరం, మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకొని కొత్తగూడెంలో నిర్మించిన నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభిస్తారు.

ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ గురువారం ఉదయం హెలికాప్టర్‌ ద్వారా మానుకోటకు చేరుకోని, ముందుగా అక్కడ నూతనంగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మహబూబాబాద్‌ కలెక్టరేట్‌ ను ప్రారంభించి, కలెక్టరేట్ ఆవరణలో జరిగే ప్రజాప్రతినిధుల సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. అనంతరం కలెక్టరేట్‌ లో అధికారులు, ప్రజాప్రతినిధులతో మహబూబాబాద్ జిల్లా అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు.

ఇక మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకొని, కొత్తగూడెంలో సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. కొత్తగూడెంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కొత్తగూడెంలో ఎల్‌ఐసీ ఆఫీసు పక్కన నిర్మించిన బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలను ముగించుకుని గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ కు తిరుగు ప్రయాణం కానున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 10 =