65 ఏళ్లు పైబడిన వారికీ, కరోనా బాధితులకు ‘పోస్టల్ బ్యాలెట్’ అవకాశం

Centre extends postal ballot facility, Centre extends postal ballot facility to voters, Centre extends postal ballot facility to voters above 65, Corona Patients Postal Ballot Facility, Govt Extends Postal Ballot Facility, Govt Extends Postal Ballot Facility Corona Patients

దేశంలో కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పైబడిన వారికీ, కరోనాతో బాధపడుతున్న వారికీ, వైరస్ సంక్రమించినట్లు అనుమానం కలిగిన వ్యక్తులకు, తేలికపాటి లక్షణాలతో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నవారికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అనుమతి నిచ్చింది. ఈ మేరకు 1961 ఎన్నికల నియమావళిని కేంద్ర ప్రభుత్వం సవరించి, జూలై 2, గురువారం నాడు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.

దేశంలో కరోనా పరిస్థితుల వలన 65 ఏళ్ల పైబడిన పెద్దలు బయటకు రావడం మంచిదికాదని, అలాగే కరోనా బాధితులు సైతం లైన్‌లో నిలుచోవడం ఓటు హాక్కును వినియోగించుకోవడం వైరస్ వ్యాప్తికి కారణమవుతుందనే నేపథ్యంలో సీఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించే సిబ్బంది, పోలీసులు సహా మరికొన్ని విభాగాలకు చెందినవారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండేది. ఈ సంవత్సరం చివరి నుంచి బీహార్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =