అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మురళీ విజయ్

Former Team India Opener Murali Vijay Announces Retirement from All Forms of International Cricket,Murali Vijay Wikipedia,Cricketer Murali Vijay,Murali Vijay Age,Murali Vijay And Dinesh Karthik,Murali Vijay Income,Murali Vijay Retirement,Mango News,Mango News Telugu,Murali Vijay Salary,Murali Vijay Wife,Naveen Murali Vijay,Nikita Vanjara Murali Vijay,Indian Cricketer Murali Vijay,Murali Vijay Second Wife,Cricket Players From India,Current Indian Cricket Commentators,Famous Indian Cricketers Of All Time,Indian Cricketer Murali Vijay Wife,Murali Vijay Vs Dinesh Karthik,Record Of Cricket Players,Records Of Indian Cricket Players

టీమిండియా మాజీ ఓపెనర్ మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లుగా సోమవారం సోషల్ మీడియా వేదికగా మురళీ విజయ్ ప్రకటన చేశాడు. 2008లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌ ద్వారా మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. భారత్ తరపున మురళీ విజయ్ మొత్తం 17 వన్డేలు, 61 టెస్ట్‌లు, 9 టీ20 మ్యాచుల్లో ఆడాడు. ‌టెస్టుల్లో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీల సహాయంతో 3982 పరుగులు, వన్డేల్లో 339, టీ20ల్లో 169 పరుగులు చేశాడు. మురళీ విజయ్ చివరిసారిగా భారత్ తరపున 2018 లో పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆడాడు. మరోవైపు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ డేర్ డెవిల్స్(ఢిల్లీ క్యాపిటల్స్), కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (పంజాబ్ కింగ్స్) జట్లకు మురళీ విజయ్ ప్రాతినిధ్యం వహించి 106 మ్యాచులు ఆడాడు. ఐపీఎల్ లో 2 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీల సహాయంతో 2619 పరుగులు చేశాడు.

రిటైర్మెంట్ పై మురళీ విజయ్ ప్రకటన చేస్తూ, తనకు అవకాశాలు కల్పించినందుకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ), తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టిఎన్‌సిఎ), చెన్నై సూపర్ కింగ్స్ మరియు చెంప్లాస్ట్ సన్మార్ లకు కృతజ్ఞతలు తెలిపాడు. అత్యున్నత స్థాయి క్రీడలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన గౌరవం దక్కడం వలన 2002-2018 నుండి వరకు జరిగిన తన ప్రయాణం తన జీవితంలో అత్యంత అద్భుతమైన సంవత్సరాలని పేర్కొన్నాడు. తన సహచరులు, కోచ్‌లు, మెంటార్‌లు మరియు సహాయక సిబ్బంది అందరికీ, వారందరితో కలిసి ఆడడం ఒక గొప్ప అదృష్టమని మరియు తన కలను నిజం చేయడంలో సహాయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఎదుర్కున్న ఆటుపోటులలో తనకు మద్దతుగా నిలిచి, తన ప్రేరణకు మూలంగా ఉన్న క్రికెట్ అభిమానులకు మురళీ విజయ్ కృతజ్ఞతలు తెలిపాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =