కెనడాలో కాల్పుల్లో మృతి చెందిన భారతీయ విద్యార్థి.. సంతాపం తెలిపిన విదేశాంగ మంత్రి జైశంకర్

Indian Student Shot Demise in Canada's Toronto MEA Jaishankar Condolences, Indian Student Shot Demise in Canada's Toronto, MEA Jaishankar Condolences To Indian Student Shot Demise in Canada's Toronto, Indian Student Shot, Indian Student Shot in Canada's Toronto, Indian student killed in shooting in Canada’s Toronto, Indian student killed, Indian student killed in Canada’s Toronto, 21-Year-Old Indian Student Shot Dead At Subway Station In Canada’s Toronto, Ghaziabad Student Shot Dead At Subway Station In Canada’s Toronto, Ghaziabad Student, Ghaziabad Student killed in Canada’s Toronto, Indian Student From Ghaziabad Shot Dead At Subway Station In Canada, 21-year-old student from Ghaziabad in Uttar Pradesh was shot dead at the Sherbourne subway in Toronto, 21-year-old student from Ghaziabad in Uttar Pradesh, 21-year-old student, Indian student Kartik Vasudev Shot Dead At Subway Station in Toronto, Mango News, Mango News Telugu,

కెనడా దేశం లోని టొరంటో నగరంలో జరిగిన ఒక కాల్పుల ఘటనలో భారతీయ విద్యార్థి కార్తీక్ వాసుదేవ్ మృతి చెందాడు. 21 సంవత్సరాల కార్తీక్ అక్కడ స్థానిక కాలేజీలో చదువుకుంటూ.. జాబ్ కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో కార్తీక్ పనిచేసే కార్యాలయానికి వెళ్తున్న సందర్భంలో సబ్‌వే స్టేషన్ సమీపంలో కాల్చి చంపబడ్డాడు.  టొరంటోలోని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కెనడాలోని టొరంటో నగరంలోని సబ్‌వే స్టేషన్ ప్రవేశద్వారం వద్ద కాల్పులు జరపడంతో 21 ఏళ్ల భారతీయ విద్యార్థి అనేక తుపాకీ గాయాలతో మరణించాడు. కార్తీక్ వాసుదేవ్ అనే బాధితుడు నిన్న సెయింట్ జేమ్స్ టౌన్‌లోని షెర్బోర్న్ టిటిసి స్టేషన్‌కు గ్లెన్ రోడ్ ప్రవేశద్వారం వద్ద కాల్చబడ్డాడు. వాసుదేవ్ ను ఆసుపత్రికి తరలించగా అక్కడ అతను చికిత్స సమయంలో మరణించాడని టొరంటో పోలీస్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న సాక్షులు, అలాగే కెమెరా ఫుటేజీని పరిశోదించటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ విద్యార్థి హత్యపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. “ఈ విషాద సంఘటనతో బాధపడ్డాను. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి” అని జైశంకర్ ట్వీట్ చేశారు.

అలాగే “టొరంటోలో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ విద్యార్థి కార్తీక్ వాసుదేవ్ దురదృష్టవశాత్తు మృతి చెందడం పట్ల మేము దిగ్భ్రాంతి చెందాము మరియు బాధపడ్డాము” అని భారత కాన్సులేట్ జనరల్ శుక్రవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో రాశారు. మేము అతని కుటుంబంతో సంప్రదిస్తున్నాము, విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. వాసుదేవ్ సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. వాసుదేవ్ స్థానిక ‘సెనెకా’ కాలేజీలో విద్యార్థి అని, అయితే ప్రైవేటుగా ఒక జాబ్ చేస్తున్నాడని తెలిపాడు. అతను హత్యకు గురైనప్పుడు ఆఫీస్ కి సబ్‌వేలో వెళుతున్నాడని చెప్పాడు. కాగా ‘సెనెకా’ కాలేజీ ఒక ప్రకటనలో.. మొదటి సెమిస్టర్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ విద్యార్థి కార్తిక్ వాసుదేవ్ యొక్క విషాద మరణం గురించి విచారం వ్యక్తం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 10 =