ఆగిన గాన కోకిల గానం.. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్‌ కన్నుమూత

భారతీయ సినీ అభిమానులను దశాబ్దాలపాటు తన గాత్రంతో మురిపించిన గాన కోకిల మూగబోయింది. లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ ఈరోజు కన్నుమూశారు. గత నెల రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నెల క్రితం ఆమె కరోనా లక్షణాలతో ముంబై బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా నుంచి కోలుకున్న లతా మంగేష్కర్‌.. వెంటిలేటర్‌పై కొన్నాళ్లు చికిత్స పొందారు. ఈ క్రమంలో.. ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు కూడా ఈమధ్యే ప్రకటించారు. అయితే తర్వాత మళ్ళీ పరిస్థితి విషమించడంతో మంగేష్కర్‌కు మళ్లీ వెంటిలేటర్‌ మీద చికిత్స అందిస్తూ వస్తున్నారు వైద్యులు. ఈక్రమంలో.. ఈరోజు ఉదయం లతా మంగేష్కర్‌ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.

1942లో గాయనిగా లతా మంగేష్కర్‌ కెరీర్‌ ప్రారంభించారు. అప్పటినుంచి 20 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు మంగేష్కర్‌. హిందీ చిత్రసీమలో లతా మంగేష్కర్‌ పాడిన పాటలు నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా ఆమెను పిలుస్తుంటారు. కాగా, లతా మంగేష్కర్‌ లేరనే వార్తతో శోక సంద్రంలో మునిగిపోయారు యావత్ సినీ సంగీత ప్రియులు. తెలుగులో కూడా కొన్ని పాటలను ఆలపించారు మంగేష్కర్‌. 1955 లో ఏఎన్నార్‌ ‘సంతానం’ సినిమాలో ఆమె పాడిన ‘నిదుర పోరా తమ్ముడా’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. అలాగే, 1965 లో ఎన్టీఆర్ దొరికితే దొంగలు సినిమాలో ‘శ్రీ వేంకటేశ’ అనే పాట పాడారు ఆమె. ఇది కూడా అభిమానులని అలరించింది.

‘భారత రత్న’ లతా మంగేష్కర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ రెండు రోజులపాటు జాతీయ సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జాతీయ పతాకాన్ని రెండు రోజులపాటు అవనతం చేస్తారు. లతా మంగేష్కర్‌ ఇక లేరనే విషయం తెలియడంతో.. పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తదితరులు ఆమె మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. లతా మంగేష్కర్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 13 =