కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వారికీ అనుమతి

Corona Negative Report Mandatory for Passengers of 4 States, Maharashtra, Maharashtra Corona, Maharashtra Corona Cases, Maharashtra Corona Second Wave, Maharashtra Coronavirus, Maharashtra Coronavirus Updates, Maharashtra COVID 19, Maharashtra Govt, Maharashtra Govt Makes Corona Negative Report Mandatory, Mango News Telugu

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుదల, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న ఢిల్లీ, రాజస్థాన్‌, గుజరాత్‌, గోవా నుంచి ముంబయి నగరానికి విమానాలు, రైళ్ల ద్వారా వచ్చే ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇక రోడ్డు మార్గం ద్వారా వచ్చే ప్రయాణికులకు బాడీ టెంపరేచర్ సహా కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు టెస్ట్ చేయనున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్స్ నవంబర్‌ 25 వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్టు తెలిపారు.

ముఖ్యంగా విమాన ప్రయాణికులకు బోర్డింగ్ అప్పుడే నెగటివ్ సర్టిఫికెట్ చూపించాలని తెలిపారు. అలాగే ముంబయిలో విమానం నుంచి దిగే సమయానికి 72 గంటల ముందుగా ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకొని ఉండాలని అన్నారు. ఈ నాలుగు రాష్ట్రాలకు చెందిన వారి వద్ద నెగెటివ్‌ రిపోర్టులు లేకుంటే విమానాశ్రయం వద్ద సొంతఖర్చుతో ఆర్టీపీసీఆర్‌ టెస్ట్ చేయించుకోవాలని, పరీక్ష పూర్తయ్యాక మాత్రమే వారిని ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇస్తామని, పరీక్షలో పాజిటివ్‌గా తేలితే నిర్ణిత ప్రోటోకాల్ ప్రకారం వారిని సంప్రదించి చికిత్స అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే ఈ నాలుగు రాష్ట్రాల నుంచి రైలు, రోడ్డు మార్గాల ద్వారా వచ్చే వారికీ కూడా ప్రత్యేక మార్గదర్శకాలను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here