మహారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సంచలన నిర్ణయం.. రేపు అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశం, ఉద్ద‌వ్‌ సర్కార్‌కు డెడ్‌లైన్‌

Maharashtra Political Crisis Governor Orders Uddhav Thackeray Govt To Prove Majority in Assembly Tomorrow, Governor Orders Uddhav Thackeray Govt To Prove Majority in Assembly Tomorrow, Maharashtra Governor Orders Uddhav Thackeray Govt To Prove Majority in Assembly Tomorrow, Uddhav Thackeray Govt To Prove Majority in Assembly, Majority in Assembly, Uddhav Thackeray Govt, Governor Orders Uddhav Thackeray Govt, Uddhav Thackeray goes to SC after ordered to prove majority in Assembly Tomorrow, Uddhav Thackeray Ordered To Prove Majority in Assembly Tomorrow, Uddhav Thackeray to face floor test in Assembly Tomorrow, floor test in Assembly, Uddhav Thackeray, Maharashtra Governor, Maharashtra Political Crisis News, Maharashtra Political Crisis Latest News, Maharashtra Political Crisis Latest Updates, Maharashtra Political Crisis Live Updates, Mango News, Mango News Telugu,

గడచిన వారం, పది రోజులుగా రోజుకో సంఘటనతో దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న మహారాష్ట్ర రాజకీయం బుధవారం కీలక మలుపు తిరిగింది. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు రేపు రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స‌మావేశాల్ని రికార్డ్ చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ కోష్యారీ ఆదేశాలు ఇచ్చారు. ఇక గవర్నర్ తాజా నిర్ణయంతో గురువారం సాయంత్రం 5 గం. లోపు సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే త‌న ప్ర‌భుత్వ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే పార్టీ ఎమ్మెల్యేలలో దాదాపు 3 వంతుల మంది.. రాష్ట్ర మంత్రి, తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే వద్ద ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రేపు సాయంత్రం షిండే వర్గం గువాహటి నుంచి ముంబైకి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఉద్ద‌వ్‌ సర్కార్ బలనిరూపణ తర్వాతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని షిండే పేర్కొన్నారు. దీంతో, రేపు ఉద్ద‌వ్‌ ఈ బల పరీక్షలో గట్టెక్కుతాడా? లేక షిండే ప్రయత్నాలు ఫలిస్తాయా? అని రాజకీయవర్గాలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

బలనిరూపణ నేపథ్యంలో.. మహారాష్ట్ర అసెంబ్లీలోని అధికార, ప్రతిపక్షాల బలాబలాల సంఖ్య ఇది..
  • మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సభ్యులు – 288
  • అయితే శివసేన ఎమ్మెల్యే ఒకరు మరణించారు, దీంతో ప్రస్తుత సభ్యుల సంఖ్య – 287
  • ఇక ఉద్ద‌వ్ ప్రభుత్వం నిలబడాలంటే కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య – 144
  • శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి బలం: 168
  • ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు తర్వాత కూటమి బలం: 119
  • ఏక్‌నాథ్ షిండేకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య – 49
  • ప్రతిపక్ష బీజేపీ కూటమి ప్రస్తుత బలం – 113
  • ఒకవేళ షిండే వర్గం మద్దతు తెలిపితే బీజేపీ బలం – 162
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − one =