ముంబయి ఇండియన్స్ జట్టు హెడ్ కోచ్‌గా మార్క్ బౌచర్‌ నియామకం

Mark Boucher Appointed as Head Coach of Mumbai Indians, Mark Boucher New Coach of Mumbai Indians, Mumbai Indians New Coach Mark Boucher, Mark Boucher New Coach, Mumbai Indians New Coach, Mango News, Mango News Telugu, Mark Boucher and Mumbai Indians, Mumbai Indians Head Coach, Live Cricket Score, Schedule, Latest News, Stats And Videos, Mark Boucher Mumbai Indians Head Coach, IPL, Mumbai Indians IPL Head Coach, Mumbai Indians

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) లో కీలక అయిన ప్రాంచైజ్ ముంబయి ఇండియన్స్ (ఏంఐ) మరో నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2023 సీజన్ నుండి తమ జట్టు హెడ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ ఆటగాడు, రికార్డ్ హోల్డింగ్ వికెట్ కీపర్ మార్క్ బౌచర్‌ను నియమించినట్లు ప్రకటించింది. ఇటీవలే విస్తరణలో భాగంగా ముంబయి ఇండియన్స్ పాటుగా ఏంఐ ఎమిరేట్స్, ఏంఐ కేప్ టౌన్‌ ప్రాంఛైజీలు ఏర్పడిన విషయం తెలిసిందే, దీంతో ముంబయి ఇండియన్స్ హెడ్​ కోచ్​ గా ఉన్న మహేలా జయవర్ధనేకు గ్లోబల్ హెడ్​ ఆఫ్​ పర్ఫామెన్స్ పదవీ, క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ గా ఉన్న జహీర్​ ఖాన్​కు గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌ పదవీతో యాజమాన్యం కొత్త బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఏంఐ హెడ్ కోచ్‌గా మార్క్ బౌచర్‌ నియామకం జరిగింది.

మార్క్ బౌచర్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా సుదీర్ఘమైన కెరీర్‌ను కలిగిఉన్నాడు, అలాగే వికెట్ కీపర్ ద్వారా అత్యధిక టెస్ట్ అవుట్‌లను చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. మార్క్ బౌచర్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత దక్షిణాఫ్రికాలో అగ్ర-స్థాయి క్రికెట్ ఫ్రాంచైజీ అయిన టైటాన్స్‌కు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు, అతని నేతృత్వంలో ఆ జట్టు ఐదు దేశవాళీ టైటిల్స్‌ గెలుచుకుంది. 2019లో దక్షిణాఫ్రికా జట్టు ప్రధాన కోచ్‌గా మార్క్ బౌచర్‌ నియమించబడ్డాడు. బౌచర్ కోచ్ గా ఉన్న సమయంలో దక్షిణాఫ్రికా జట్టు 11 టెస్ట్ విజయాలు, 12 వన్డేలు మరియు 23 టీ20 విజయాలు సాధించింది.

హెడ్ కోచ్‌గా మార్క్ బౌచర్ నియామకంపై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ ఎం.అంబానీ మాట్లాడుతూ “మార్క్ బౌచర్‌ను ముంబయి ఇండియన్స్‌ కు స్వాగతించడం ఆనందంగా ఉంది. మైదానంలో మరియు దాని వెలుపల అతని నిరూపితమైన నైపుణ్యంతో, కోచ్‌గా తన జట్టును అనేక విజయాలకు మార్గనిర్దేశం చేస్తాడు, మార్క్ ఏంఐ జట్టుకు అపారమైన విలువను జోడిస్తాడు మరియు దాని వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతాడు” అని అన్నారు.

మార్క్ బౌచర్ స్పందిస్తూ, “ఏంఐ యొక్క ప్రధాన కోచ్‌గా నియమించబడడం గౌరవం మరియు విశేషం. ఫ్రాంచైజీగా వారి చరిత్ర మరియు విజయాలు స్పష్టంగా ప్రపంచ క్రీడలన్నింటిలో అత్యంత విజయవంతమైన క్రీడా ఫ్రాంచైజీలలో ఒకటిగా వారిని నిలబెట్టాయి. నేను సవాలు కోసం ఎదురు చూస్తున్నాను మరియు ఫలితాల అవసరాన్ని గౌరవిస్తాను. ఇది గొప్ప నాయకత్వం మరియు ఆటగాళ్లతో కూడిన బలమైన యూనిట్. ఈ డైనమిక్ యూనిట్‌కు విలువను జోడించడానికి నేను ఎదురుచూస్తున్నాను” అని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 16 =