‘నాసా’ సరికొత్త ప్రయోగం, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్‌ ఆర్టెమిస్‌-1 చంద్రుడి పైకి లాంఛింగ్

NASA Launches Mega Rocket Artemis 1 on Maiden Flight Over The Moon without Astronauts From Florida Today,NASA Mega Rocket,Artemis 1 on Maiden Flight,Moon without Astronauts,Mango News, Mango News Telugu,NASA,Artemis 1,Artemis 1 Flight,Artemis 1 Rocket,Artemis 1 Latest News And Updates,NASA Launches Mega Rocket,National Aeronautics and Space Administration,NASA News And Live Updates,NASA Live Updates

అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ అత్యంత శక్తివంతమైన రాకెట్‌ ఆర్టెమిస్‌-1ను ప్రయోగించింది. ఈ మేరకు బుధవారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్‌ప్యాడ్ 39బి నుంచి అక్కడి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 01:47 గంటలకు ప్రారంభించబడింది. నాసా యొక్క శక్తివంతమైన కొత్త 32-అంతస్తుల పొడవైన స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) రాకెట్ మరియు ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్ అపరిమిత వేగంతో నింగిలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఇది చంద్రునిపైకి దాదాపు అర మిలియన్ మైళ్ల ప్రయాణం చేయనుందని స్పేస్ ఏజెన్సీ నాసా పేర్కొంది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుని పైకి ఇప్పటివరకు ప్రయాణించని దానికంటే ఎక్కువ దూరం పయనించనుంది. కాగా అపోలో 11 ద్వారా 16 జూలై 1969–20 జూలై 1969లో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ బృందం చంద్రుడిపైన ల్యాండ్ అయిన తర్వాత ఇప్పటివరకూ మళ్ళీ అమెరికా ఇలాంటి ప్రయోగం చేయలేదు. ఈసారి అంగారక గ్రహానికి వెళ్లే మిషన్‌కు సిద్ధం కావడానికి ముందుగా దీనిని ప్రయోగించింది.

భవిష్యత్తులో మానవులు చంద్రుడి ఉపరితలం పైకి చేరుకోవడానికి వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో నాసా ఆర్టెమిస్‌-1ను చేపట్టింది. కాగా ఆర్టెమిస్ 1 ఫ్లైట్ టెస్ట్ అనేది సిబ్బంది లేని మిషన్ అని, ఇది ఆర్టెమిస్‌లో భాగంగా సిబ్బందితో కూడిన ఫ్లైట్ టెస్ట్ కు మరియు భవిష్యత్తులో హ్యూమన్ లూనార్ అన్వేషణకు మార్గం సుగమం చేస్తుందని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ప్రత్యేకంగా చంద్రునిపై మానవ ఉనికిని నెలకొల్పడానికి సహాయపడే వ్యవస్థలను నిర్మించడానికి ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. అయితే ముందుగా ఆర్టెమిస్‌ 1 ప్రయోగాన్ని ఆగస్ట్ 29, సోమవారం ఉదయం తలపెట్టగా, చివరి గంటలో వాయిదా పడింది. స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్‌లో ఆర్ఎస్-25 ఇంజిన్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేస్తునట్టుగా నాసా ప్రకటించింది. అనంతరం సెప్టెంబరు చివరలో ఫ్లోరిడాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇయాన్‌తో సహా వాతావరణ వైఫల్యాల కారణంగా మరోసారి ప్రయోగం వాయిదా పడింది. అయితే ఈరోజు ఎట్టకేలకు ఆర్టెమిస్‌-1 నింగిలోకి దూసుకెళ్లింది.

ఆర్టెమిస్‌-1 మిషన్ ప్రత్యేకతలు..

  • లాంఛింగ్ తేదీ: నవంబర్ 16, 2022
  • మిషన్ వ్యవధి: 25 రోజులు, 11 గంటలు, 36 నిమిషాలు
  • ప్రయాణించనున్న మొత్తం దూరం: 1.3 మైలియన్ మైళ్లు
  • రీ-ఎంట్రీ వేగం: 24,500 mph (Mach 32)
  • రాకెట్ నిర్దేశిత ప్రాంతంలోకి చేరనున్న తేదీ: డిసెంబర్ 11, 2022.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =