బ్యాకప్‌ అవసరం లేకుండానే పని పూర్తి

WhatsApp, New Phone, WhatsApp Transfer on New Phone is now Easy, WhatsApp, backup, WhatsApp transfer on new phone is easy, backup, new phone WhatsApp transfer, Transfer WhatsApp messages, new mobile, old phone, Backup Process, Android devices, Mango News Telugu, Mango News latest technology updates, latest technology updates 2024
WhatsApp, backup,WhatsApp transfer on new phone is easy, backup, new phone WhatsApp transfer

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడే యాప్.. వాట్సాప్.  ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలతో పాటు ముఖ్యమైన సమాచారాన్ని, మన ప్రతీ అప్ డేట్‌ను  ఇతరులతో పంచుకోవడానికి ఇప్పుడు చాలామంది వాట్సాప్‌నే వాడుతున్నారు. అయితే అన్నిటికి వాట్సాప్ వాడటం వల్ల ఇందులో డేటా మొత్తం స్టోర్ అవుతూనే ఉంటుంది. ఒక్కోసారి కొత్త మొబైల్ ఫోన్ కొన్నప్పుడు.. వాట్సాప్ లోని మొత్తం  డేటాను కొత్త ఫోన్ లోకి మార్చాలని అనుకుంటారు.

కొత్త మొబైల్‌ కొన్నప్పుడు  పాత మొబైల్‌లోని డేటా మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి బ్యాకప్‌ ఆప్షన్‌ ద్వారా  కొత్త ఫోన్‌లో రీస్టోర్‌ చేస్తుంటాం. అయితే ఇకపై ఇలా చేయక్కరలేదని వాట్సాప్ తన వినియోగదారులకు చెబుతోంది.  బ్యాకప్‌ చేయకుండా కూడా వాట్సప్‌లోని చాట్‌ హిస్టరీని కొత్త మొబైల్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు.

దీని కోసం వాట్సప్‌ చాట్ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు. క్లౌడ్‌ ఆధారంగా పనిచేసే బ్యాకప్‌ కంటే కూడా ఈ ఆప్షన్‌లో చాలా ఫాస్ట్‌గా, ఈజీగా వాట్సాప్ ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఈ సమయంలో పాత, కొత్త ఫోన్లు రెండూ దగ్గర ఉంచుకోవాలి. అవి రెండు ఒకే వైఫైకి కనెక్ట్‌ అయ్యేలా చేయడంతో  పాటు, లొకేషన్‌ సర్వీసు కూడా ఆన్‌లో ఉంచాలి.

ముందు  పాత మొబైల్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేసి.. సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. తర్వాత చాట్‌ సెట్టింగ్స్‌కు వెళ్లి అందులో ఉన్న చాట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో చాట్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టార్ట్ అవుతుంది.  ఇక్కడో క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ఓపెన్‌ అవుతుంది. తర్వాత కొత్త మొబైల్‌లో వాట్సప్‌ ఇన్‌స్టాల్‌ చేసి పాత అదే ఫోన్‌ నంబర్‌తోనే లాగిన్‌ అవ్వాలి.వెంటనే పాత మొబైల్‌కు వచ్చే వెరిఫికేషన్‌ కోడ్‌ను కొత్త దాంట్లో ఎంటర్‌ చేయాలి.

కొత్త మొబైల్‌లో చూపించే క్యూఆర్‌ కోడ్‌ను పాత మొబైల్‌లో చూపించే స్కానర్‌తో స్కాన్‌ చేయాలి. ఆ తర్వాత పాత ఫోన్లో ఉన్న డేటా మొత్తం కొత్త ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. కొన్ని నిమిషాల పాటు కొనసాగే ఈ వాట్సప్‌ చాట్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్రాసెస్ జరిగే సమయంలో రెండు ఫోన్లూ పక్కపక్కనే ఉంచుతూ.. స్క్రీన్‌లూ ఆన్‌లోనే ఉంచాలనే విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − ten =