ఇండియా పేరును తమ దేశానికి పెట్టుకుంటామంటున్న పాకిస్తాన్

Pakistan Will Claim The Name India Social Media Post Goes Viral,Pakistan Will Claim The Name India,India Social Media Post Goes Viral,Pakistan Will Claim Post Goes Viral,Mango News,Mango News Telugu,Pakistan, name of India, country, INDIA Name Change,Bharath, G-20, President Of India,Modi,The Name India,The Name India Latest News,The Name India Latest Updates,INDIA Name Change News Today,INDIA Name Change Latest News

ఆలూ లేదు చూలూ లేదు అల్లుడు పేరు సోమలింగం అన్న చందంగా ఉంది పాకిస్తాన్ తీరు. ఎందుకంటే ఇండియా పేరు భారత్‌గా మారనుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఐక్యరాజ్యసమితి ముందు ఇండియా అనే పేరును భారత్ వదులుకుంటే ఆ పేరును పాకిస్తాన్ తీసుకోవడానికి ఆశ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వార్తలు పాక్ లోకల్ ఛానెళ్లలో గుప్పుమంటున్నాయి. అయితే ఇండియా పేరును భారత్‌గా మార్చుతామంటూ.. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన గానీ.. సూచనలు గానీ చేయకపోవడంతో దేశం పేరు మార్పు ఉంటుందా అనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఇక్కడ ఏ క్లారిటీ రాకుండానే పాకిస్తాన్ ఆశపడటంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.

ఐక్యరాజ్యసమితి సమక్షంలో.. ఇండియా పేరును భారత్‌గా మారుస్తున్నట్లు అధికారిక ప్రకటన మాత్రం వెలువడితే.. వెంటనే తమ దేశానికి ఇండియా అనే పేరును పాకిస్తాన్ పెట్టుకోవచ్చంటూ పాక్ స్థానిక మీడియాలోనూ, ఇక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చాలా కాలంగా పాకిస్తాన్‌లో ఉన్న జాతీయవాదులంతా ఇండియా అనేది తమ ప్రాంతానికి చెందినదే అనే వాదిస్తూ ఉంటారు. దీనికి ఓ కారణం కూడా చెబుతారు. సింధు ప్రాంతం పేరు నుంచే ఇండియా పేరు వచ్చిందని.. దేశం విడిపోకముందు నుంచీ ఇండియా అనే పేరు ఉందని అంటారు. స్వాతంత్య్రం దక్కిన సమయంలో భారత్, పాకిస్తాన్ విడిపోవడంతో.. ఇండియా పేరు మీద నిజానికి తమకే ఎక్కువ హక్కులు ఉన్నాయని జాతీయవాదులు చెబుతూ ఉంటారు. దీంతోనే తాజాగా ఇండియా పేరను భారత్‍‌‌గా మారుస్తున్నారన్న, వార్తలు, వాదనలు, ఊహాగానాలు వినిపించడం ఎక్కవవడంతో.. తమ దేశానికి ఇండియా పేరును పెట్టుకోవాలని పాకిస్తాన్ చూస్తోందనే వార్తలు బయటికి వస్తున్నాయి. దీనిపై సౌత్ ఏషియా ఇండెక్స్.. ఎక్స్ ప్లాట్‌ఫామ్ వేదికగా తమ ‌అకౌంట్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరోవైపు ఈ పోస్టుపై నెట్టింట్లో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇండియా పేరును పాకిస్తాన్ పెట్టుకుంటే.. అప్పుడు పాకిస్థాన్ పేరును ఆఫ్ఘనిస్తాన్ పెట్టుకుంటుందా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు ఇండియాగా పేరు మార్చుకున్నా కూడా పాకిస్తాన్ తలరాత, బుద్ధి మాత్రం మారదంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఏకంగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా కౌంటర్ ఇచ్చారు. అక్కడ గ్రామమే లేదు.. కానీ అంతలోనే దాన్ని దోచుకోవడానికి దొంగలు తయారయ్యారని తనదైన స్టైల్‌లో ట్వీట్ చేశారు.

మరోవైపు పేరు మార్పుపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినా కూడా కొద్ది రోజులుగా దీనిపై వార్తలు మాత్రం జోరందుకుంటున్నాయి. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జీ 20 సమావేశాల కోసం.. రాష్ట్రపతి భవన్ నుంచి విదేశీ గెస్టులకు పంపించిన స్పెషల్ ఇన్విటేషన్‌లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో.. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని కేంద్రం ప్రింట్ చేయించింది. దీంతోనే ఇండియా పేరును భారత్‌గా మార్చుతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత రోజే ప్రధాని మోడీ ఇండోనేషియా టూర్ సందర్భంగా.. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అంటూ ప్రకటన రిలీజ్ అవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడేవరకూ ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందనేది క్లారిటీ రాదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − eleven =