ప్రకృతి వైపరీత్యాల సమయంలో కలసికట్టుగా సేవలందించాలి – ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు

PM Modi Calls For Integrated Response From The World in 5th International Conference on Disaster Resilient Infrastructure,PM Modi Calls For Integrated Response,Integrated Response From The World,Integrated Response in 5th International Conference,Disaster Resilient Infrastructure,Mango News,Mango News Telugu,PM Modi on Disaster Resilient Infrastructure,PM Modi addresses International Conference,Response to disaster should be integrated,Modi calls for integrated preparations,Narendra modi Latest News and Updates

ప్రకృతి వైపరీత్యాల సమయంలో అన్ని దేశాలు కలసికట్టుగా సేవలందించాలని ప్రపంచ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విపత్తుల పట్ల సమగ్ర ప్రతిస్పందన అవసరమన్న ఆయన, ఒక ప్రాంతంలో చోటుచేసుకున్న విపత్తు ప్రపంచంలో పూర్తిగా భిన్నమైన ప్రాంతంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. కొయెలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్‌ఐ) కోసం ఏర్పాటు చేసిన ఐదవ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఎంత ఉత్తమంగా నిర్వహించవచ్చు? అనే విషయాల గురించి ఆయన పలు కీలక సూచనలు చేశారు.

సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కేవలం 4 సంవత్సరాలలో 40 దేశాలు సీడీఆర్‌ఐలో భాగమయ్యాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం సీడీఆర్‌ఐని గొప్ప అంచనాలతో చూస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, చిన్న,పెద్ద దేశాలు మరియు ప్రపంచ ఉత్తర మరియు దక్షిణాది దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా మారిందని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాలు కేవలం రాబడికి సంబంధించినవి మాత్రమే కావని, స్థితిస్థాపకతకు సంబంధించినవని, అలాగే మౌలిక సదుపాయాలపై సమగ్ర దృక్పథాన్ని కలిగి ఉండాలని తెలిపారు. ఇక రవాణా మౌలిక సదుపాయాలు ఎంత ముఖ్యమో.. సామాజిక, డిజిటల్ మౌలిక సదుపాయాలు కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు.

ప్రతి దేశం ఇటీవల కాలంలో వివిధ రకాల విపత్తులను ఎదుర్కొంటోందని, ఈ నేపథ్యంలో వీటిని తట్టుకోగలిగే మౌలిక సదుపాయాలకు సంబంధించిన స్థానిక పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా.. ప్రస్తుతం యూరప్‌ను తాకిన వేడి తరంగాలు, తుఫానులు మరియు ఇటీవలి టర్కీ మరియు సిరియాలో భూకంపం సంభవించిన సంఘటనలను ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. కాగా ‘రెసిలెంట్ అండ్ ఇన్‌క్లూజివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ అనేది ఈ ఏడాది సదస్సు థీమ్ గా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 18 =