ఢిల్లీలో 90వ ‘ఇంటర్‌పోల్’ వార్షిక సమావేశాలను ప్రారంభించిన ప్రధాని మోదీ, పాల్గొన్న 195 దేశాల సభ్యులు

PM Modi Inaugurates 90th Interpol General Assembly in New Delhi Today Members Attends From 195 Countries, PM Modi Inaugurates 90th Interpol General Assembly, 90th Interpol General Assembly, Interpol General Assembly in New Delhi, Mango News, Mango News Telugu, PM Modi Interpol General Assembly, Interpol General Assembly Members Attends From 195 Countries, Interpol General Assembly, Pm Narendra Modi To Address 90th Interpol General Assembly, PM Narendra Modi Interpol Meet, PM Narendra Modi Latest News And Updates, PM Narendra Modi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 90వ ‘ఇంటర్‌పోల్’ వార్షిక సమావేశాలను ప్రారంభించారు. ప్రగతి మైదాన్‌లో నేటినుంచి నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ సభ ఈ నెల 21తో ముగియనుంది. సాధారణంగా ఇంటర్‌పోల్ యొక్క సుప్రీం గవర్నింగ్ బాడీ, జనరల్ అసెంబ్లీ దాని పనితీరుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సంవత్సరానికి ఒకసారి ఇది సమావేశమవుతుంది. భారత్‌లో చివరిసారిగా 1997లో జరిగిన ఈ సమావేశం 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో జరుగుతుండటం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి, ఇంటర్‌పోల్ అధ్యక్షుడు అహ్మద్ నాజర్ అల్ రైసీ, సెక్రటరీ జనరల్ మిస్టర్ జుర్గెన్ స్టాక్, సీబీఐ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75వ సంవత్సరాల వేడుకల సందర్భంగా.. 2022లో న్యూఢిల్లీలో ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీని నిర్వహించాలనే భారత్ ప్రతిపాదనను జనరల్ అసెంబ్లీ అత్యధిక మెజారిటీతో ఆమోదించినందుకు కృతజ్ఞతలని చెప్పారు. అలాగే భారతదేశం యొక్క లా అండ్ ఆర్డర్ సిస్టమ్‌లోని ఉత్తమ అభ్యాసాలను ప్రపంచం మొత్తానికి ప్రదర్శించడానికి ఈ ఈవెంట్ అవకాశాన్ని అందిస్తుందని ప్రధానిపేర్కొన్నారు. భారతదేశ విజయాలు మరియు కృషిని కొనియాడారు. దేశం ప్రపంచానికి ఒక కేస్ స్టడీ అని, ఇటీవలి సంవత్సరాలలో దేశం సాధించిన ప్రగతి అసామాన్యమని అన్నారు.

ఇంటర్‌పోల్ చీఫ్ జుర్గెన్ మాట్లాడుతూ.. వాస్తవ మరియు వర్చువల్ ప్రపంచంలో హింస పెరగడం వలన ప్రభుత్వాలు మరియు వ్యాపారాలపై సామాజిక, ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. వ్యవస్థీకృత క్రైమ్ నెట్‌వర్క్‌లు బిలియన్ల డాలర్లను ఆర్జిస్తున్నాయని, దీనిలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి పోరాటాన్ని పెంచాలని ఇంటర్‌పోల్ చీఫ్ పిలుపునిచ్చారు. ఇక ఈ ఇంటర్‌పోల్ సమావేశానికి 195 ఇంటర్‌పోల్ సభ్య దేశాలకు చెందిన మంత్రులు, ఆయా దేశాల పోలీసు చీఫ్‌లు, నేషనల్ సెంట్రల్ బ్యూరోల అధిపతులు మరియు సీనియర్ పోలీసు అధికారులతో కూడిన ప్రతినిధులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + nineteen =