అమృత్‌సర్‌లో హై ఎలర్ట్.. 24 గంటల్లో స్వర్ణ దేవాలయం సమీపంలో రెండు పేలుళ్లు

Punjab Second Explosion Reported at Heritage Street Near Golden Temple within 24 Hours in Amritsar,Punjab Second Explosion Reported,Second Explosion Reported at Heritage Street,Explosion Reported at Heritage Street Near Golden Temple,Punjab Second Explosion Reported within 24 Hours,Mango News,Mango News Telugu,Punjab Second Explosion Reported In Amritsar,Second blast in 24 hours in Punjab,Another Explosion Near Golden Temple,Amritsar Latest News And Updates,Punjab Second Explosion Latest News And Updates,Explosion Reported Near Golden Temple

పంజాబ్‌లో వరుస పేలుడు ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిక్కుల పవిత్ర యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచిన అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం (గోల్డెన్ టెంపుల్) సమీపంలో ఇది చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్వర్ణ దేవాలయానికి సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో తొలిసారిగా బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. పోలీసులు చికిత్స కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా, తాజాగా అదే ప్రాంతంలో మరోసారి పేలుడు సంభవించింది. సోమవారం ఉదయం 6-7 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే బాంబు స్క్యాడ్, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరీక్షల కోసం నమూనాలను సేకరించారు.

అలాగే ప్రత్యేక పోలీస్ బృందాలు నగరమంతా విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. అయితే ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. కాగా ఈ పేలుడు శబ్దం గోల్డెన్ టెంపుల్ సమీపంలోని స్థానికులకు వినిపించింది. పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వెలువడినట్లు వారు తెలిపారు. కాగా 24 గంటల వ్యవధిలో రెండు పేలుళ్లు జరగడంతో పోలీసులు అమృత్‌సర్‌లో హై ఎలర్ట్ ప్రకటించారు. ఇక హెరిటేజ్ స్ట్రీట్ పార్కింగ్ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు పేలుడు పదార్ధంతో పాటు ఒక బాంబును దారంతో వేలాడదీయడంతో పేలుడు సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం పేలుడు ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోందని, అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అమృత్‌సర్‌ పొలీసు అధికారులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 15 =