జియో 5జీ సేవలు 2021 ద్వితీయార్ధం నుంచి ప్రారంభం – ముకేశ్ అంబానీ

Reliance Chairman Mukesh Ambani Says Jio 5G Services Will Available In India By Mid-2021,Reliance Chairman Mukesh Ambani,Mukesh Ambani,Jio 5G Services,Jio,Jio 5G,Jio 5G Services Available In India,Jio 5G Service To Launch in India in Second Half of 2021,Mukesh Ambani Latest News,5G Network,Jio 5G To Be Available From 2021 Confirms Mukesh Ambani,Jio 5G Services Will Be Available In India By Mid-2021,Jio To Launch 5G Services,Reliance Jio to Launch 5G Network,Jio 5G Will Launch In India By Mid-2021,Mango News,Mango News Telugu

దేశంలో జియో 5జీ సేవలను 2021 ద్వితీయార్ధం నుంచి ప్రారంభించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించినట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. మంగళవారం నాడు జరిగిన ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌-2020 లో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ 5జీ టెక్నాలజీని రిలయన్స్ జియో సొంతంగా దేశీయంగా అభివృద్ధి చేసిందని చెప్పారు. 5జీ మొబైల్ నెట్‌వర్క్ అనేది టెక్నాలజీలో తదుపరి గొప్ప పరిణామమని, ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాల్లో అందుబాటులో ఉండగా, భారత్ లో 5జీ సేవలను ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని అన్నారు. 2021 లో దేశంలో 5జీ విప్లవానికి జియో మార్గదర్శకత్వం వహించడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.

దేశంలో 5జీ నెట్‌వర్క్‌ను తొందరగా ప్రారంభించేందుకు అత్యవసర ప్రాతిపదికన అవసరమైన విధానపరమైన నిర్ణయాలను కేంద్రం‌ త్వరగా తీసుకోవాలని కోరారు. దేశమంతటా ఇప్పటికే 4జీ నెట్‌వర్క్‌ విస్తరించి ఉన్నపటికీ దాదాపు 30 కోట్లమంది ప్రజలు ఇంకా 2జీ నెట్‌వర్క్‌ నే వినియోగిస్తున్నారని చెప్పారు. చౌక ధరల్లో 5జీ స్మార్ట్‌ఫోన్లు తీసుకురావడం ద్వారా వారందరికీ మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించే అవకాశం ఉంటుందని ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =