తాజ్‌మ‌హ‌ల్‌కు నోటీసులు జారీ.. రూ. కోటి నీటి బిల్లు, ఆస్తి ప‌న్ను చెల్లించాల‌ని ఆదేశించిన ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్

Taj Mahal Gets Notice To pay Rs 1 Cr of Water Bill and Property Tax From Agra Municipal Corporation,Notices Issued To Taj Mahal,Agra Municipal Corporation,1 Crore Water Bill & Property Tax,Mango News,Mango News Telugu,Taj Mahal Gets Notice For Property Tax,Taj Mahal Gets Notice Water Bills,Agra Taj Mahal,Where Is The Taj Mahal,Taj Mahal At Night,Taj Mahal Inside,Taj Mahal Story,Taj Mahal News,Taj Mahal Ticket Price,Is Taj Mahal Open During Lockdown,Delonghi Taj Mahal Notice,Notice Lego Taj Mahal,Taj Mahal Entry Charges,Taj Mahal Visit Charges,Taj Mahal Customer Care,Taj Mahal Is Closed,Taj Mahal How To Say,Taj Mahal Guide Charges,Taj Mahal Visitors Timings

ప్రపంచ వింతల్లో ఒకటైన భారతీయ చారిత్రాత్మక పురాతన కట్టడం తాజ్‌మ‌హ‌ల్‌ నోటీసులు అందుకుంది. రూ. కోటి నీటి బిల్లు మరియు ఆస్తి ప‌న్ను చెల్లించాల‌ని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్ నోటీసులు పంపింది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్‌ను సందర్శించడానికి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున విదేశీ పర్యాటకులు భారతదేశానికి వస్తుంటారు. తన 370 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా తాజ్‌మ‌హ‌ల్‌, ఆస్తి పన్ను మరియు నీటి బిల్లుల కోసం నోటీసులు అందుకోవడం విశేషం. దీనికి సంబంధించి ఇప్పటివరకు మూడు నోటీసులు అందాయని, వాటిలో తాజ్ మహల్‌కు రెండు, ఆగ్రా కోటకు ఒకటి వచ్చాయని ఆగ్రాలోని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ నిర్ధారించారు.

అయితే ఈ నోటీసులు పొరబాటున జారీ అయి ఉండొచ్చని భావిస్తున్నామని, ఎందుకంటే భారతదేశంలోని అన్ని స్మారక కట్టడాలకు ఆస్తి పన్ను లేదా ఇంటి పన్ను వంటివి మినహాయించబడతాయని ఆయన తెలిపారు. అలాగే ఇక్కడ ఉన్న నీటి కనెక్షన్‌ను తాము ఎలాంటి వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం లేదని, తాజ్ మ‌హ‌ల్‌ కాంప్లెక్స్ లోపల నిర్వహించే లాన్‌లు, పార్కులు వంటివి కూడా పచ్చదనం మరియు సందర్శకుల కోసమని, ఇది ప్రజా సేవ కిందకు వస్తుందని, ఈ నోటీసులు తమకు వర్తించవని ఆయన స్పష్టం చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ చట్టాలలో కూడా ఈ నిబంధన ఉందని చెప్పిన త్వరలోనే ఇది పరిష్కరించబడిందని ఆశిస్తున్నామని రాజ్ కుమార్ పటేల్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =