మోడీకి పోటీగా ఆ ఇద్దరు నేతలు..?

Those Two Leaders To Compete With Modi,Those Two Leaders To Compete,Leaders To Compete With Modi,PM Modi, Parliament Elections, CM Nithish Kumar, Priyanka Gandhi,Mango News,Mango News Telugu,Indian Prime Minister Narendra Modi,Parliament Elections Latest News,Parliament Elections Latest Updates,PM Modi Live News,PM Modi Latest Updates,Narendra Modi Latest News And Updates
PM Modi, Parliament elections, CM Nithish kumar, priyanka gandhi

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ.. దేశవ్యాప్తంగా రాజకీయాలు భగ్గుమంటున్నాయి. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని ఇండియా కూటమి తహతహలాడుతోంది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అయితే ఈసారి అధికారంలోకి రావడమే కాకుండా.. ప్రధాని మోడీని కూడా ఓడించాలని ఇండియా కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. ఎట్టి పరిస్థితిలోనైనా మోడీని ఓడించాలని ఇండియా కూటమి ఇప్పటి నుంచే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.

భారతీయ జనతా పార్టీకి యూపీలోని వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం కంచుకోట. అక్కడ ఆ పార్టీకి ఓటమి అంటేనే తెలియదు. 1991 నుంచి ఒక్క 2004లో తప్పించి మిగిలిన అన్ని ఎన్నికల్లో అక్కడ బీజేపీ గెలుస్తూ వస్తోంది. ప్రధాని మోడీ అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ అదే స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు.  రెండు ఎన్నికల్లోనూ 60 శాతానికి పైగా ఓట్లు మోడీకి పోలయ్యాయి. వారణాసిపై మంచి పట్టున్న బీజేపీ.. ఆ పట్టును మరింత పెంచుకునేందుకు మోడీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

అయితే ఈసారి కూడా మోడీ వారణాసి నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణ నుంచి కూడా పోటీ చేయనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈక్రమంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా.. మోడీని ఓడించి తీరాలని ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈక్రమంలో మోడీపై పోటీకి రంగంలోకి దింపేందుకు బలమైన నేతలను వెతికే పనిలో పడింది. అయితే ఇప్పటికే ఇద్దరు దిగ్గజ నాయకుల పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీల పేర్లు తెరపైకి వచ్చాయట.  ఎన్నికలవేళ పరిస్థితిని బట్టి..వారిలో ఒకరిని మోడీపై పోటీకి దింపాలని కూటమి భావిస్తోందట. ఒకవేళ ఆ ఇద్దరిలో ఎవరూ పోటీ చేయకపోతే.. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌నను బరిలోకి దింపాలని భావిస్తోందట. మరి మోడీపై పోటీకి ఎవరు దిగుతారు?.. బీజేపీ కంచుకోటలో పోటీ చేసి మోడీని ఢీ కొట్ట గలరా? అనేది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 1 =