హిందూపురంలో మరో ప్రయోగం చేస్తున్న జగన్, ఈసారయినా సైకిల్ కి అడ్డుపడేనా?

CM Jagan To Plan For an Experiment in Hindupur To Defeat TDP in Coming Elections,CM Jagan To Plan For an Experiment,Experiment in Hindupur,Hindupur To Defeat TDP,TDP in Coming Elections,Mango News,Mango News Telugu,Andhra Pradesh CM Jagan Mohan Reddy,Jagan pushes for welfare work,CM Jagan Plan Experiment Latest News,Experiment in Hindupur Latest News,Experiment in Hindupur Latest Updates,TDP in Coming Elections Latest News,TDP in Coming Elections Latest Updates,TDP in Coming Elections Live News,AP 2024 Elections,2024 Andhra Pradesh Election,Hindupur Latest News,Hindupur Latest Updates

ఆంధ్రప్రదేశ్ లో హిందూపురం అసెంబ్లీ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆపార్టీకి ఓటమి లేని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి. అందులో కుప్పం నుంచి బావ చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తుంటే, రెండోస్థానం హిందూపురం నుంచి బావమరిది బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక హిందూపురం నుంచి నందమూరి కుటుంబీకులు అత్యధిక మార్లు గెలిచారు. వారిలో ఎన్టీఆర్ నుంచి హరికృష్ణ, బాలకృష్ణ కూడా ఉండడం విశేషం. తండ్రితో పాటుగా ఇద్దరు తనయులు గెలిచిన స్థానంగా హిందూపురానికి ప్రత్యేకత ఉంది.

హిందూపురంలో బీసీలలో టీడీపీది తిరుగులేని స్థానం. ముఖ్యంగా చేనేత కులాలు ఆపార్టీకి అండగా ఉంటారు. దాంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్ వరకూ చేసిన అనేక ప్రయోగాలు బెడిసికొట్టాయి. ముస్లీంలు గణనీయంగా ఉండే నియోజకవర్గం కావడంతో మైనార్టీ నేతను బరిలో దింపినా సైకిల్ హవాకి చెక్ పెట్టలేకపోయారు. ఎన్ని రకాలుగా యత్నించినా టీడీపీని ఓడించలేకపోయారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత తొలి ఎన్నికల్లో నవీన్ నిశ్ఛల్ ని పోటీలో పెట్టినా ఫలితం రాకపోవడంతో 2019లో మైనార్టీ నేత మహామద్ ఇక్బాల్ ని బరిలో దింపింది. అయినా నందమూరి బాలకృష్ణ విజయాన్ని అడ్డుకోలేకపోయింది. జగన్ హవాలో సైతం బాలకృష్ణ విజయకేతనం ఎగురవేశారు.

నాలుగేళ్లుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ ఇక్బాల్ తీరు మీద స్థానికంగా వ్యతిరేకత ఉంది. అంతేగాకుండా సీనియర్ నాయకుడు నవీన్ నిశ్ఛల్ వర్గం విడిగా పనిచేస్తోంది. వర్గాలుగా విడిపోయిన నేతలు పార్టీని విజయపథంలో నడపగలరన్న నమ్మకం లేని వైఎస్సార్సీపీ అధిష్టానం ఇప్పుడు దీపిక అనే మరో మహిళా నేతను తెరమీదకు తెచ్చింది. ఇక్బాల్ పట్ల రెడ్డి కులస్తుల్లో ఉన్న వ్యతిరేకత, నవీన్ ని మైనార్టీలు అంగీకరించడం లేదనే కారణంగా తాజాగా రెడ్డి, కురబ కులాల కాంబినేషన్ లో దీపిక తెరమీదకు వచ్చారు. గతంలో కళ్యాణదుర్గం నుంచి కురబ కులానికి చెందిన ఉషశ్రీ చరణ్ , భర్త రెడ్డి కావడంతో ఆ కాంబినేషన్ ఉపయోగపడింది. ఇప్పుడు హిందూపురంలో కూడా దీపిక రాకతో అలాంంటి ఫలితాన్నే వైఎస్సార్సీపీ ఆశిస్తోంది.

హిందూపురంలో స్థానికంగా ఉన్న నేతలంతా దీపిక కి సహకరిస్తారా అన్నది సందేహంగా ఉంది. అధికార వైఎస్సార్సీపీ నేతల వర్గపోరు సమసిపోకుండా కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన దీపిక ప్రభావం చూపగలరా అన్నది ప్రశ్నగానే కనిపిస్తోంది. దాంతో కొత్త నాయకురాలు పాత నేతలతో ఎంత మేరకు సమన్వయం చేసుకోగలరన్నది హిందూపురంలో వైఎస్సార్సీపీ భవితవ్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. మరోసారి విజయకేతనం ఎగురవేయాలనే దూకుడుతో సాగుతున్న బాలయ్య హ్యాట్రిక్ విజయాలను అడ్డుకోవడంలో జగన్ వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది తేలుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =