రేవంత్ రెడ్డి కేబినెట్‌లో 11 మందికి చోటు

11 seats in Revanth Reddys cabinet,Revanth Reddys cabinet,seats in cabinet,Revanth Reddy 11 seats,Revanth Reddy, Congress, Congres cabinet, seethakka, batti vikramarka, thummala nageshwar rao, ponguleti srinivas reddy,Mango News,Mango News Telugu,Lobbying begins for Telangana,Telangana Cabinet,Telangana Election Results,Telangana CM oath ceremony,Congress Revanth Reddy, Revanth Reddy Latest News,Revanth Reddy Latest Updates,Revanth Reddy Live News
Revanth Reddy, Congress, Congres cabinet, seethakka, batti vikramarka, thummala nageshwar rao, ponguleti srinivas reddy,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్ధతు లభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మరికొద్ది గంటల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా మరికాసేపట్లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అలాగే భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. వీరితో పాటు కేబినెట్‌లో చోటు దక్కించుకున్న 11 మంది.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేబినెట్‌లో చోటు కల్పించిన మంత్రుల జాబితాను కాంగ్రెస్‌ నేతలు రాజ్‌భవన్‌కు అందించారు. అలాగే మంత్రివర్గ జాబితాలో ఉన్న వారికి స్వయంగా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.

కేబినెట్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కొండా సురేఖ, సీతక్క.. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి.. ఉమ్మడి కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు.. ఉమ్మడి మెదక్ నుంచి దామోదర్ రాజనర్సింహ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

ఇకపోతే ప్రమాణస్వీకారం కోసం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. సభలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రజా వేదికపై ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్టేడియంలో ఎడవ వైపున 64 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. కుడి వైపులో వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదికను ఏర్పాటు చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబామల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ.. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీని ఏర్పాటు చేశారు.

అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్, కళాకారులతో రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలకనున్నారు. మరోవైపు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − five =