లక్ష మెజార్టీతో ఈసారి బండి సంజయ్ గెలుపు: సర్వే

Bandi sanjay, Karimnagar, BJP, Telangana BJP, Loksabha elections, Karimnagar elections, MP Bandi sanjay, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates, Mango News Telugu, Mango News
Bandi sanjay, Karimnagar, BJP, Telangana BJP, Lokk sabha elections

తెలంగాణ బీజేపీలో దమ్మున్న నేత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోయిన పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చారు. అంతేకాకుండా అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపడంలో.. అక్రమాలు, అన్యాయాలపై  పోరాటం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు బండి సంజయ్. అటు త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి వీలైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. పోయిన సారి నాలుగు స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. ఈసారి దానికి రెట్టింపు స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.

ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ గెలుపు అవకాశాలపై సర్వే చేయిస్తుండగా.. బండి సంజయ్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆయన కరీంనగర్ నుంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని సర్వేలో తేలింది. 2019లో బండి సంజయ్ కరీంనగర్ నుంచి బీజేపీ తరుపున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కరీంనగర్ నుంచి బీజేపీ తరుపున బరిలోకి దిగారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు.

అయితే కరీంనగర్‌లో బండి సంజయ్‌కు ఉన్న బలం, బలగాన్ని చూసి వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకు ఆ టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతోంది. స్థానిక నేతలు బండికి ఈసారి టికెట్ దక్కకుండా ప్రయత్నాలు చేస్తున్నప్పటకీ.. హైకమాండ్ మాత్రం ఆయన వైపే మొగ్గుచూపుతోంది. ఈక్రమంలో బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఆయనకు అసలు తిరుగే లేదని స్ఫష్టమయింది. బీజేపీ తెలంగాణలో మిగిలిన స్థానాల్లో గెలిచినా గెలవకపోయినా.. కరీంనగర్‌లో మాత్రం కచ్చితంగా గెలిచి తీరుతుందని సర్వేలో తేలిందట.

కరీంనగర్‌లో బీఆర్ఎస్ పూర్తిగా వీక్ అయిందని సర్వేలో వెల్లడయిందట. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఆ పార్టీ గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయట. అటు అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా కరీంనగర్‌లో సరైన అభ్యర్థి ఎవరూ లేరు.  ఈ రెండు అంశాలు బండి సంజయ్‌కు ప్లస్ అవుతున్నాయట. అంతేకాకుండా తెలంగాణ బీజేపీ అధ్యుక్షుడిగా బాగా పనిచేశారని బండి సంజయ్‌కు మంచి పేరు ఉంది. అలాగే ఆయన అధ్యక్ష పదవిలో దూసుకెళ్తున్న సమయంలో అనవసరంగా ఆయన్ను తొలగించాలరనే సింపతీ కూడా ఉంది. ఇవన్ని ఫ్యాక్టర్స్ వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ గెలుపుకు దోహద పడుతున్నాయని సర్వేలో వెల్లడయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 15 =