బండి సంజయ్ అరెస్ట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విజయశాంతి

Bandi Sanjay Arrest, BJP Senior Leader, BJP Senior Leader Vijayasanthi Fires on TRS Government, BJP Senior Leader Vijayasanthi Fires on TRS Government Over Bandi Sanjay Arrest, Mango News, telangana, Telangana BJP chief arrested for attacking police, Telangana BJP Chief Bandi Sanjay, Telangana BJP Chief Bandi Sanjay Arrested, Telangana BJP Chief Bandi Sanjay Arrested During Protest, Telangana BJP Chief Bandi Sanjay’s Bail Plea Rejected, Telangana BJP President Bandi Sanjay Kumar, Tension in Telangana’s Karimnagar as police arrest BJP MP, Vijayasanthi, Vijayasanthi Fires on TRS Government, Vijayasanthi Fires on TRS Government Over Bandi Sanjay Arrest

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్ట్ చేయడంపై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ అరెస్ట్ అనంతరం సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీరు సరిగా లేదని మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ ప్రజాసామ్యబద్ధంగా పోరాటం చేసేవారిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. తెలంగాణ ప్రజల కోసం మేము పోరాడుతున్నామని.. దానిలో భాగంగానే 317 జీవో సవరణ చేయాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ దీక్ష చేశారని గుర్తు చేశారు. అయితే, దీనిని కూడా పోలీసులు అడ్డుకొని సంజయ్ ని అరెస్ట్ చేశారని విజయశాంతి విమర్శించారు.

బీజేపీ నేతలను కరీంనగర్ వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డ విజయశాంతి.. బీజేపీ మీటింగ్‌ల వలనే కరోనా వస్తుందా? మీ మీటింగ్‌ల వలన కరోనా రాదా.. అని ఆమె ప్రశ్నించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. అందుకే, బీజేపీ దీక్ష చేసిన రోజే కాంగ్రెస్ కూడా ఎదో ఒక దీక్ష చేస్తుందని మండిపడ్డారు. బండి సంజయ్ అరెస్ట్ సందర్భంగా.. మహిళల చీరలు లాగారు, మా కార్యకర్తలను లాఠీలతో కొట్టారు. పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగా లేదని విజయశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలోని రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, ఒక్కొక్కరూ ఒక్కో సమస్యతో బాధపడుతున్నారు. వారందరికీ బీజేపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై కేంద్రానికి రిపోర్ట్స్ వెళ్లాయి. త్వరలోనే కేంద్రం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది’’ అని.. విజయశాంతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ పోలీసులు, బండి సంజయ్తో పాటు కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విజయశాంతి స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 2 =