సీఎం కేసీఆర్ కీలక ప్రకటన, నవంబర్ 12న అన్ని నియోజకవర్గాల్లో రైతులతో ధ‌ర్నాలు

#KCR, Chief Minister accuses BJP of double standards on paddy Procurement, CM KCR Announced Protest with Farmers on November 12th, CM KCR Announced Protest with Farmers on November 12th over Paddy Procurement, CM KCR assures ryots of paddy procurement, Farmers Protest Over Paddy Procurement, KCR Protest Over Paddy Procurement, Mango News, Paddy Procurement, Paddy procurement In Telangana, Protest with Farmers on November 12th over Paddy Procurement

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం సాయంత్రం ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్ వ‌డ్ల గురించి మాట్లాడ‌కుండా, సొల్లు పురాణం మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. గట్టిగా మాట్లాడి, ప్ర‌జ‌ల ప‌క్షాన నిజాలు బ‌య‌ట‌పెట్టి దేశ‌ద్రోహులు అంటున్నారని, కేంద్రానికి సహకరించి ప‌లు బిల్లుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ప్పుడు దేశ ద్రోహులం కాలేదా అన్నారు. ఇది బీజేపీ స్టైల్ అని, ఎవరూ ఉన్న విష‌యాలు మాట్లాడి నిలదీసినా దేశద్రోహులు స్టాంప్ వేస్తున్నారని విమర్శించారు.

మరోవైపు తెలంగాణ రాష్టంలో పండే ధాన్యాన్ని పూర్తిగా కొనేవరకు వదిలిపెట్టమని, ఈ అంశంపై కేంద్రంతోనే తేల్చుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అలాగే కేంద్రంపై పోరాటంపై కీలక ప్రకటన చేశారు. కేంద్రం వ‌డ్లు కొనాల‌ని డిమాండ్ తో వ‌చ్చే శుక్ర‌వారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో ధ‌ర్నాలు చేప‌డుతామని చెప్పారు. ల‌క్ష‌లాది మంది రైతుల‌తో క‌లిసి ధ‌ర్నాలు చేయ‌బోతున్నామని, వ‌డ్లు కొంటారా లేదా అనేది తేల్చిచెప్పాల్సిందేనని, వెంటాడతామని అన్నారు. అలాగే ఈ ధర్నాలో తమతో కలిసి నువ్వు కూడా కూర్చుంటావా? అని బండి సంజయ్ ను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రైతుల ప్ర‌యోజ‌నాల కోసం ఎంతకైనా కొట్లాడుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 11 =