సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం, ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో మద్యాహ్న భోజనం పథకం

CM KCR, CM KCR Decides to Start Midday Meal Scheme, Govt to introduce mid day meal in degree, Mid-day meal scheme for junior colleges, Midday Meal Scheme For All Govt Inter Degree College Students, Telangana CM KCR, Telangana govt to extend midday meal scheme, Telangana plans mid-day meal in govt colleges

విద్యారంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మద్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మద్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీని వల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నారని సీఎం చెప్పారు. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు, విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మద్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.

జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి సంబంధించిన చర్చ వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ తమ సొంత ఖర్చులతో జూనియర్ కాలేజీ విద్యార్థులకు మద్యాహ్న భోజనం పెడుతున్న సమాచారం సీఎం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లెక్చరర్ రఘురామ్ ను సీఎం అభినందించారు. కాలేజీల్లో మద్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని సీఎం చెప్పారు. అలాగే లెక్చరర్ రఘురామ్ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని కూడా సీఎం కేసీఆర్ మంజూరు చేశారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 2 =