జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష

CM KCR meeting with Irrigation department, CM KCR Review Meeting on Irrigation Department, CM KCR Review with Irrigation Department Officials, Irrigation Department, Irrigation Department Officials, KCR On Irrigation Department, KCR Review with Irrigation Department Officials, Review Meeting on Irrigation Department, Telangana Irrigation Department

తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తర్వాత పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందని సాగునీటి వసతులు పెరిగాయని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపు హౌజులు, ఆయకట్టు పెరిగినందున పనిభారం కూడా పెరిగిందని సీఎం అన్నారు. మారిన పరిస్థితికి అనుగుణంగా జల వనరుల శాఖలో సిఇలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జల వనరుల శాఖ అంతా ఒక విభాగంగానే పనిచేస్తుందని వెల్లడించారు.

జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణపై సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్ ఇంజనీర్ల ప్రాదేశిక ప్రాంతాలుంటే, వాటి సంఖ్యను 19కి పెంచాలని ఈ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, రామగుండం, వరంగల్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, హైదరాబాద్ కేంద్రాలుగా సిఇ ప్రాదేశిక ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ ప్రాదేశిక ప్రాంతాల పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, ఐడిసి లిఫ్టులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్ హైజులు, కాలువలు, సబ్ స్టేషన్లు అన్ని సిఇ పరిధి కిందికే వస్తాయి. గతంలో భారీ, మధ్యతరహా, చిన్న తరహా, ఐడిసి లాంటి వివిధ విభాగాల కింద ఉన్న నీటి పారుదల శాఖ ఇకపై కేవలం జల వనరుల శాఖగా మాత్రమే కొనసాగుతుంది.

అలాగే మెదక్ జిల్లాలోని ఘనపూర్ ఆనికట్ కు వనదుర్గ ప్రాజెక్టుగా పేరు పెట్టాలని సీఎం నిర్ణయించారు. పాఖాల ప్రాజెక్టు కింద కాల్వలను పునరుద్ధరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన కాల్వలు శిథిలమైపోయాయని, వీటిని పునరుద్ధరించడం ద్వారా 30 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సీఎంకి విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం కాకతీయులు నిర్మించిన పాఖాల కాల్వలను పునరుద్ధరించడం అంటే వారసత్వాన్ని కాపాడుకోవడమే అన్నారు. వెంటనే అంచనాలు తయారు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =