సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు.. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలుకు 7 వేల కేంద్రాలు ఏర్పాటు

CM KCR Issued Key Orders To Set up 7000 Procurement Centres For Yasangi Grain Across Telangana,CM KCR Issued Key Orders,Orders To Set up 7000 Procurement Centres,Yasangi Grain Across Telangana,Mango News,Mango News Telugu,Agriculture Minister Niranjan Reddy,Rythu Bandhu,Telangana Rythu Bandhu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణలో యాసంగి (రబీ) కోతలు ప్రారంభమైనందున, రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. దీనికోసం మొత్తం 7 వేల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కూడా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌లకు సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అవసరమైన ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఇక గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా మొత్తం 7 వేల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులు తమ పంటల కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

కాగా ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దీంతో సుమారు 1.30 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం దిగుబడిలో సుమారు 80-90 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలుకు సుమారు రూ.15 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్ల నిధులు అవసరమని అంచనా వేస్తున్న అధికారులు.. రైతులు తమ ధాన్యం విక్రయించిన వారం రోజుల వ్యవధిలోనే వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రతి కేంద్రంలోనూ టార్పాలిన్లు, ధాన్యం తూర్పారపట్టే యంత్రాలు, హమాలీలు, గోనె సంచులు వంటి అన్ని రకాల సౌకర్యాలను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు మంత్రులు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్‌, నిరంజన్‌ రెడ్డిలు సోమవారం ఎంసీఆర్‌హెచ్చార్డీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + seventeen =