వచ్చే నెలలో ఖమ్మంలో ఐటీ హబ్ ప్రారంభం – మంత్రి పువ్వాడ అజయ్

IT Hub Constructing with Estimated Cost of Rs.25 Crores at Khammam, IT Hub Khammam, IT Hub Works In Khammam, Khammam, Minister Puvvada Ajay, Minister Puvvada Ajay Inspects IT Hub Works In Khammam, Minister Puvvada Ajay Visited IT Hub Constructing, Puvvada Ajay Visited IT Hub, Search Results Web results Khammam IT hub, Search Results Web results Khammam IT hub to be ready by Dasara, telangana, Telangana News

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ విరివిగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అనేక సంస్థలను ఆహ్వానిస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఐటీ అంటే ఇప్పుడు ఇంటెలిజెంట్ టెక్నాలజీగా మారిపోతుంది అభివర్ణించారు. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించాలని భావించి రాష్ట్రంలో ఖమ్మంకు సుప్రసిద్ధ స్థానం కల్పించాలనే భావంతో ఖమ్మంకు ఐటీ హబ్ ను తేవడం జరిగిందన్నారు.

ఖమ్మం నగర నడిబొడ్డులో కోట్ల రూపాయల స్థలంలో 25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఐటీ హబ్(ట్విన్ టవర్స్)ను మంత్రి పువ్వాడ అజయ్ ఈ రోజు సందర్శించారు. ఆయా సేవలు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయని అన్నారు. ఇప్పటికే పనులు పూర్తి కావచ్చాయని, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేతుల మీదగా వచ్చే నెల ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో నిరుద్యోగులకు ఐటీ హబ్ కల్పవల్లిగా మారబోతుందని వ్యాఖ్యానించారు. స్థానికులకు ముందు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకుని అభివృద్ధి వైపు పయనం సాగించాలని అందుకు తెలంగాణ ప్రభుత్వం ఐటీ ని ప్రోత్సహిస్తూందన్నారు.

ఐటీ టవర్‌లోని కంపెనీల్లో ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇప్పటికే అందజేశామని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో టాలెంట్ కేవలం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ లాంటి నగరాల విద్యార్థులకే సొంతం కాదన్నారు. ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోని నైపుణ్యవంతులైన యువత ఇతర నగరాలకు వలస పోవాల్సి వస్తోందని, ఐటీ నిర్వచనం మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదని, ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఐటీ పురోభివృద్ధిపై పలు అనుమానాలు ఉండేవని, ఇప్పుడు దేశంలో రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు. అప్పట్లో ఐటీ ఎగుమతులు తక్కువగా ఉండేవని, ప్రస్తుతం ఐదేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఐటీ ఎగుమతులు రూ.1.28 లక్షల కోట్లకు చేరాయని వివరించారు. మరిన్ని ఉద్యోగావకాశాల కోసం మరిన్ని ఐటీ సంస్థలు ముందుకు రావాలని ఆకాంక్షించారు. జిల్లా యువతకు అధిక ప్రాధాన్యతను ఇస్తామని అర్హులైన వారికి ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవొచ్చని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =