రెవెన్యూ సంబంధిత అంశాలపై పలు జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియోకాన్ఫరెన్స్

CS Santi Kumari held Video Conference with Several District Collectors on Revenue Related Issues,CS Shanti Kumari High Level Meeting,Formula E-Racing,Secretariat Security Arrangements,Mango News,Mango News Telugu,Telangana Parliment Meeting,Telangana Meeting Cabinet,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

రాష్ట్రంలో పేదల ప్రయోజనార్థం ప్రభుత్వం ప్రకటించిన జీవో నెం.58,59,76 ల ఉత్తర్వుల మేరకు క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి లబ్దిదారులకు పట్టాల పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి అన్నారు. రెవెన్యూ సంబంధిత అంశాలపై సీఎస్ శాంతికుమారి శనివారం పలు జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బీఆర్కేఆర్ భవన్ నుండి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంచిర్యాల, సిద్ధిపేట, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష చేశారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ప్రధానంగా జీవో నెం.58,59,76 అంశాలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ విషయంలో పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రెవెన్యూ అధికారులు కృషిచేయాలని స్పష్టం చేశారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఈ జీవోలకు సంబంధించిన అంశాలను పూర్తి చేయాలని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, సీసీఎల్ఏ ప్రత్యేక అధికారి సత్యశారద, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =