పెద్ద నగరాల్లో పెద్ద ఇళ్లకే క్రేజ్

Hyderabad, Top City, India, Telangana, Largest Homes in India in 2023, luxury homes, Hyderabad biggest homes, Telangana Latest Updates, Hyderabad News, Mango News Telugu, Mango News, Telangana Updates, Hyderabad Latest Updates, New Houses, Top Cities
Hyderabad, Telangana, Top City

దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకుంటోంది. దేశంలోని అన్ని మెయిన్ సిటీలలో అపార్ట్మెంట్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా లగ్జరీ ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి.ఇండియాలో  టాప్-ఏడు నగరాల్లో సగటున ‘ఫ్లాట్ సైజ్’ గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 11 శాతం వరకూ పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒక్క ముంబై మెట్రోపాలిటన్, కోల్‌కతా రెండు నగరాల్లో మాత్రమే ఫ్లాట్ సైజ్ తగ్గినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిలీజ్ చేసిన  తాజా పరిశోధన నివేదిక ప్రకారం.. న్యూ ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూర్, పూణే, చెన్నైలో  2022లో 1,175 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్.. సగటున 2023లో 1,300 చదరపు అడుగులకు చేరినట్లు పేర్కొంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి వల్ల నేర్చుకున్న గుణపాఠాలతో పెద్ద ఇళ్ల కోసం డిమాండ్ పెరిగింది. అందుకే కోవిడ్ తగ్గిన తర్వాత   తర్వాత 2022- 2023 నుంచి గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది.

ఏడు సిటీల్లో  గతేడాదిలో సగటున ఫ్లాట్ పరిమాణంలో ఢిల్లీ అత్యధిక వృద్ధిని సాధించింది. 2022లో 1,375 చదరపు అడుగుల నుంచి 2023లో 1,890 చదరపు అడుగులకు పెరిగింది. ఢిల్లీలో ఏకంగా 37 శాతం పెరుగుదల కనిపించింది. అక్కడ పెద్ద పరిమాణంలో గృహాలకు, ముఖ్యంగా లగ్జరీ అపార్ట్మెంట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడినట్లు నివేదిక చెబుతోంది.

భారతదేశంలోని టాప్-ఏడు నగరాల్లో హైదరాబాద్‌లోనే అత్యధిక ఫ్లాట్ విస్తీర్ణాన్ని కలిగి ఉందని.. అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది . 2023లో 2,300 చదరపు అడుగులతో హైదరాబాద్ తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానంలో 1,890 స్కేర్ ఫీట్‌తో ఢిల్లీ రెండోస్థానంలో ఉంది.  ఐదేళ్ల కాలంలో, 2019 నుంచి హైదరాబాద్‌లో మాత్రం  సగటు ఫ్లాట్ సైజులు 12శాతం పెరిగాయి. చెన్నై, బెంగళూర్ నగరాల్లో వరసగా ఫ్లాట్ పరిమాణాలు 1,260,  1,484 చదరపు అడుగులుగా ఉంది.

అయితే  2023లో సగటున ఫ్లాట్ పరిమాణం తగ్గిన నగరాల్లో ముంబై, కోల్‌కతా ఉన్నాయి. ముంబైలో సగటు ఫ్లాట్ పరిమాణాలు 2022లో 840 చదరపు అడుగుల నుంచి  2023లో 794 చదరపు అడుగులకు తగ్గినట్లు నివేదిక తేల్చింది. ఇది 5 శాతం వార్షిక క్షీణతను సూచిస్తుంది. అయితే 5 ఏళ్ల వ్యవధిలో ముంబయిలో సగటు పరిమాణాలు 2019కి సమానంగా 784 చదరపు అడుగులుగా ఉంది. కోల్‌కతాలో, సగటు ఫ్లాట్ పరిమాణాలు 2022లో 1,150 చదరపు అడుగుల నుంచి 2023లో 1,124 చదరపు అడుగులకు తగ్గి, 2 శాతం వార్షిక క్షీణతను చూపించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − four =