హైదరాబాద్ జ‌ర్న‌లిస్టుల ఇళ్ల స్థలాల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన సుప్రీంకోర్టుకు, చీఫ్ జ‌స్టిస్‌కు ధన్యవాదాలు – మంత్రి కేటీఆర్

Minister KTR Extends Gratitude To SC and CJI For Clearing the Telangana Journalist Society House Site Allotments, KTR Thanks To CJI NV Ramana, CJI NV Ramana Cleared Telangana Journalists Site Issue , Mango News, Chief Justice of India NV Ramana, CJI NV Ramana Latest News And Updates, Kalavakuntla Taraka Rama Rao, KTR Twitter Live Updates, CJI NV Ramana Retirement, Telangana Governement News, Telangana Journalists Site Issue, TRS Party, Telangana Journalists, House Site Construction Issue,KCR

సుదీర్ఘ కాలంగా ఇళ్ల స్థ‌లాల కోసం పోరాడుతున్న హైద‌రాబాద్‌లోని జ‌ర్న‌లిస్టుల‌కు సుప్రీంకోర్ట్ లో ఊరట లభించింది. గతంలో ప్రభుత్వం జ‌ర్న‌లిస్టుల‌కు కేటాయించిన స్థ‌లాల స్వాధీనానికి మరియు నిర్మాణాల‌కు అనుమ‌తిస్తూ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం గురువారం తీర్పునిచ్చింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో ‘ఇంటి స్థలాల కేటాయింపులపై తెలంగాణ జర్నలిస్టు సంఘం దీర్ఘకాలిక డిమాండ్‌ను క్లియర్ చేసినందుకు గౌరవనీయులైన సుప్రీంకోర్టు & సీజేఐ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది తెలంగాణ ప్రభుత్వం మన జర్నలిస్ట్ స్నేహితులకు మా వాగ్దానాన్ని నెరవేర్చడంలో సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు.

ఇక కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. అయితే వారికి భూమి కేటాయించారు కానీ అభివృద్ధి చేయలేదు. వారంతా కలిసి ఆ స్థలం కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారు. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి అనుమతిస్తున్నాం, అలాగే వారు ఆ స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చు. రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయానికొచ్చాం అని సీజేఐ తుది తీర్పులో పేర్కొన్నారు. కాగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తన పదవీ విరమణకు ఒక రోజు ముందు ఈ కీలక తీర్పునివ్వడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =