నామినేషన్లలో ఒక పేరు..వాడుకలో మరో పేరు

One name in nominations another name in usage,One name in nominations,Another name in usage,leaders, nominations,Pocharam Srinivas Reddy, Seethakka, Rasamayi Balakishan, Padma Devender Reddy, BRS, BJP, Congress, Bandaru Sravani,Mango News,Mango News Telugu,Pocharam Srinivas Reddy Latest News,Pocharam Srinivas Reddy Latest Updates,BRS Latest News,BRS Latest Updates,Bandaru Sravani Latest News,Bandaru Sravani News Today,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates
leaders, nominations,Pocharam Srinivas Reddy, Seethakka, Rasamayi Balakishan, Padma Devender Reddy, BRS, BJP, Congress, Bandaru Sravani,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతలంతా ప్రచారాలతో  పోరెత్తిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎదురైన ఒక విచిత్రమైన విషయం గురించి మరోసారి అంతా చర్చించుకుంటున్నారు.  అభ్యర్థుల నామినేషన్ పేపర్లలో ఉన్న పేర్లతో చూస్తే..అదేంటీ వీళ్లెవరూ  అని అనుకునేలా ఉన్నాయి కొంతమంది ప్రముఖుల పేర్లు.  ఎందుకంటే వారి అసలు పేరు ఒకటి అయితే.. వాడుకలో అంతా పిలిచే  పేరు మరొకటి.  పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, రసమయయి బాలకిషన్, పద్మా దేవేందర్ రెడ్డి వంటి నేతలు ఇప్పుడు ఈ కోవలోకే వస్తున్నారు.

రసమయి బాలకిషన్‌గా అందరికీ పరిచితుడైన బీఆర్ఎస్ అభ్యర్థి అసలు పేరు ఇరుకుల బాలకిషన్ అని సొంతపార్టీలోని నేతలలో కూడా చాలామందికి తెలియదు. తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణలో రసమయి అనే సాంస్కృతిక సంస్థను ఆయన  స్థాపించడమే కాకుండా..ఆ సంస్థ  కోసం కృషి చేయడంతో అదే ఆయన ఇంటిపేరుగా మారిపోయి..చివరకు రసమయి బాలకిషన్‌గా  ఫేమస్ అయిపోయారు.

పద్మా దేవేందర్ రెడ్డిగా ఫేమస్ అయిన ఈ కాషాయ పార్టీ నాయకురాలు పేరు కూడా ఇది కాదట. పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఆమె అసలు పేరు.. మాధవ రెడ్డి గారి పద్మ. కానీ రాజకీయాల్లో మాత్రం   పద్మా దేవేందర్ రెడ్డిగానే ఆమె గుర్తింపు పొందారు.

అలాగే ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్కని .. అక్కా,   సీతక్కా అని పిలిచేవారే తప్ప ఆమె అసలు పేరు ఎవరికీ తెలియదు.సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ. మరి ఈ ధనసరి అనసూయ.. సీతక్కగా ఎందుకు మారాల్సి వచ్చింది అంటే.. దానికి ఓ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఆమె నక్సలిజంలో ఉన్నప్పుడు  సీతక్కగా పేరు పొందింది. కానీ ఆ తర్వాత జనజీవన స్రవంతిలోకి కలిసిపోయి, రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఇంకా అదే పేరుతో కొనసాగుతున్నారు.

ఇక బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఇలాంటి కోవకే చెందుతారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి  అసలు పేరు పరిగె శ్రీనివాస్ రెడ్డి. రాజకీయాల్లో శ్రీనివాస్ అనే పేరుతో ఎక్కువ మంది కనిపిస్తుండటంతో.. మొదటిలో ఆయన పేరు ఆయన స్వగ్రామమైన బాన్సువాడ మండలం పోచారం గ్రామం పేరుతో  ముడిపెట్టి పిలవడం ప్రారంభించారు. అలా అలా ఆయన స్వగ్రామమే ఇప్పుడు ఆయన ఇంటిపేరుగా మారి పోచారం శ్రీనివాస్ రెడ్డిగా మారిపోయింది.

ఇక చివరగా జగిత్యాల బీజేపీ అభ్యర్థి  భోగ శ్రావణి కూడా ఇదే లిస్టులో ఉన్నారు. భోగ శ్రావణి అసలు పేరు బండారు శ్రావణి. అయితేఅత్తగారి ఇంటి పేరు భోగ కావడంతో పెళ్లయ్యాక ఆమె పేరు బోగ శ్రావణిగా మాత్రమే వాడుకలో ఉంది. కానీ  నామినేషన్ పత్రాలలో మాత్రం బండారు శ్రావణి గానే మెన్షన్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 15 =