మహబూబ్‌నగర్‌ పర్యటనలో మంత్రి కేటీఆర్‌.. దివిటిపల్లిలో అమరరాజా కంపెనీకి భూమిపూజ మరియు ఐటీ టవర్‌ ప్రారంభం

Minister KTR Lays Foundation Stone For Amara Raja Lithium Battery Company and Inaugurates IT Tower in Mahabubnagar,Minister KTR Lays Foundation Stone For Amara Raja Lithium Battery Company,KTR Inaugurates IT Tower,KTR Inaugurates IT Tower In Mahabubanagar,Mango News,Mango News Telugu,Amara Raja Lithium Battery Company,IT Tower in Mahabubnagar,All set for Mahabubnagar IT tower inauguration,Amara Raja Lithium Battery Company Latest News And Updates,IT Tower Latest News And Updates,Minister KTR Latest News And Updates

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీటిలో ప్రధానంగా జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నూతనంగా నిర్మించిన ఐటీ కారిడార్‌ను మరో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎనిమిది టెక్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ ఎంవోయూలు కుదుర్చుకున్నారు. కాగా దీనిద్వారా స్థానిక యువతకు ఉపాధి కలిగించే విధంగా ఆయా కంపెనీలకు ఐటీ టవర్‌లో స్థలాన్ని కేటాయించనున్నారు. అనంతరం దివిటిపల్లి సమీపంలోనే సుమారు 270 ఎకరాల్లో నిర్మించనున్న అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి గల్లా అరుణ, గల్లా జయదేవ్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ భూమిపూజలో పాల్గొన్నారు.

అనంతరం మంత్రి కేటీఆర్‌, బ్యాటరీ కంపెనీకి సంబంధించి పలు విషయాలను తెలిపే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తిలకించారు. ఈ సందర్భంగా బ్యాటరీ కంపెనీ ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు. కంపెనీ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం తరపున ఎలాంటి సాయమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇక మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పలు జంక్షన్లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల అనంతరం స్థానిక బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక సభ ముగిసిన తర్వాత మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్మించనున్న ఐల్యాండ్‌ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసి శిల్పారామాన్ని ప్రారంభిస్తారు. అలాగే దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పార్కులో జంగిల్‌ సఫారీని కూడా మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − thirteen =