నగరంలో పచ్చదనం కోసం ఎనలేని కృషి, ఆరేళ్లలో ఎన్నో పార్కులు ఏర్పాటు: మంత్రి కేటిఆర్

GHMC, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, Greater Hyderabad Municipal Corporation, Mango News, Minister KTR, Minister KTR Released a Special Video over Theme, Urban Forest Parks, Urban Forest Parks Establishment, Video On Urban Forest Parks Establishment

టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటిఆర్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ తన ప్రసంగాలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. గత ఆరేళ్లుగా హైదరాబాద్ నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ, హైదరాబాద్ మరింత గొప్పగా అభివృద్ధి చెందాలంటే మళ్ళీ టిఆర్ఎస్ పార్టీనే భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఇక మరోవైపు సోషల్ మీడియా వేదికైన ట్విట్టర్ ద్వారా కూడా టిఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో ప్రత్యేక వీడియోలు పోస్టు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి కేటిఆర్ శుక్రవారం నాడు కూడా ఓ ప్రత్యేక వీడియో పోస్టు చేసి “గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హరితహారం స్ఫూర్తితో నగరంలో పచ్చదనం పెంచేందుకు గత ఆరేళ్లలో ఎనలేని కృషి జరిగింది. అనేక థీమ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. డిసెంబర్ 1 నాడు జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయండి. అభివృద్ధికి అండగా నిలవండి” అని పేర్కొన్నారు. గత ఆరేళ్లల్లో 934 కాలనీ పార్కులు, 460 ట్రీ పార్కులు, 58 థీమ్ పార్కులు, చిల్డ్రన్ ప్లే పార్కులు, రైన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కులు, 59 బ్లాకులను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేయడం సహా అనేక అంశాలను ఈ వీడియోలో పొందుపరిచారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 7 =