ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకాలపై మంత్రులు హరీశ్ రావు, తలసాని సమీక్షా సమావేశం

Ministers Harish Rao Talasani held Review on Free Fish Seedlings and Sheep Units Distribution Schemes, Minister Harish Rao held Review on Free Fish Seedlings and Sheep Units Distribution Schemes, Minister Talasani held Review on Free Fish Seedlings and Sheep Units Distribution Schemes, Free Fish Seedlings and Sheep Units Distribution Schemes, Sheep Units Distribution Schemes, Free Fish Seedlings Schemes, Ministers Harish Rao Talasani held Review Meet on Free Fish Seedlings and Sheep Units Distribution Schemes, Ministers Harish Rao Talasani held Review Meeting on Free Fish Seedlings and Sheep Units Distribution Schemes, Minister Harish Rao, Minister Talasani, Sheep Units Distribution Scheme News, Sheep Units Distribution Scheme Latest News, Sheep Units Distribution Scheme Latest Updates, Sheep Units Distribution Scheme Live Updates, Mango News, Mango News Telugu,

గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు మరియు పథకాల అమలుపై మంత్రి హరీశ్ రావు, పశుసంవర్ధక, మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సంయుక్తంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమంది ప్రజల యొక్క అభ్యున్నతి కొరకై అమలు చేస్తున్న పథకాలైన ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై గొర్రెల యూనిట్ల పంపిణీ మరియు పాడి పశువుల పంపిణీ తదితర పథకాలపై జరిగిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ పథకాలను మరింత వేగవంతంగా అమలు చేయడానికి తగిన సూచనలు సలహాలను ఈ సమావేశంలో ఇరువురు మంత్రులు అధికారులకు తెలియజేశారు. అంతేకాకుండా పశు వైద్యశాలల ఆధునీకరణ, నూతన పశు వైద్యశాలల నిర్మాణం మరియు రావిర్యాలలో నిర్మిస్తున్న మెగా డైరీ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో ఉన్న అన్ని నీటి వనరులలో చేప పిల్లలు మరియు రొయ్య పిల్లల విడుదలపై కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, డైరీ అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − one =