ఆగస్టు 31 నుండి ప్రారంభంకానున్న గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు: మంత్రి తలసాని

Ministers Talasani Srinivas Mahmood Ali Held Review on Arrangements to be Made for Ganesh Festival Celebrations, Minister Mahmood Ali Held Review on Arrangements to be Made for Ganesh Festival Celebrations, Minister Talasani Srinivas Held Review on Arrangements to be Made for Ganesh Festival Celebrations, Review on Arrangements to be Made for Ganesh Festival Celebrations, Ganesh Festival Celebrations, Minister Mahmood Ali, Minister Talasani Srinivas, Ganesh Festival Celebrations News, Ganesh Festival Celebrations Latest News And Updates, Ganesh Festival Celebrations Live Updates, Mango News, Mango News Telugu,

ఆగస్టు 31 నుండి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం మర్రి చన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, హైదరాబాద్ లో ప్రతి ఏటా నిర్వహించే గణేష్ ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నదని చెప్పారు. భక్తులు, ఉత్సవాల నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ సంవత్సరం జీహెఛ్ఎంసీ ఆధ్వర్యంలో 4 లక్షలు, పోల్యుషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో ఒక లక్ష, హెఛ్ఎండీఏ ఆధ్వర్యంలో ఒక లక్ష చొప్పున మొత్తం 6 లక్షల విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అత్యంత ఆదరణ కలిగిన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురికాకుండా ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో భారికేడ్ లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

ఈ నెల 24 వ తేదీన అధికారులతో కలిసి ఖైరతాబాద్ వినాయక మండపాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న 25 పాండ్స్ కు అదనంగా మరో 50 పాండ్స్ ను నిర్మించడం జరిగిందని తెలిపారు. విగ్రహాల ఊరేగింపు నిర్వహించే రహదారులలో అవసరమైన చోట్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. విగ్రహాల నిమజ్జనం నిర్వహించే ప్రాంతాల్లో క్రేన్ లు, లైటింగ్, జనరేటర్ లు, గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచడం, తదితర అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రతి మండపం వద్ద జీహెఛ్ఎంసీ సిబ్బంది పారిశుధ్య పనులను నిర్వహిస్తారని అన్నారు. సెప్టెంబర్ 9వ తేదీన నిర్వహించే గణేష్ నిమజ్జనం రోజున 8 వేల మంది జీహెఛ్ఎంసీ సిబ్బంది మూడు షిఫ్ట్ లలో విధులు నిర్వహిస్తారని తెలిపారు. అవసరమైన ప్రాంతాలలో ట్రాపిక్ డైవర్షన్ చేయడం జరుగుతుందని, శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీసు సిబ్బందిని నిమయమించడంతో పాటు మఫ్టీ, షీ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు కూడా గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న అందరు జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్ శర్మ, ఆర్ధిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణా రావు, హోం శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ రవిగుప్తా, అదనపు డీజీపీ జితేందర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రెటరీ నీతూకుమారి ప్రసాద్, పోలీస్ కమిషనర్ లు సీవీ ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, జీహెఛ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, టీఎస్ఎస్పీడీసీఎల్ ఎండీ రఘుమా రెడ్డి, కల్చరల్ డైరెక్టర్ హరికృష్ణ, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు భగవంతరావు, రాఘవరెడ్డి, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి చెందిన నిరంజన్ రెడ్డి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు సుదర్శన్, సికింద్రాబాద్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు శీలం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 10 =