ఈ టెక్నాలజీ బారిన పడకూడదంటే ఏం చేయాలి?

What is deepfake video technology,What is deepfake video,video technology,Mango News,Mango News Telugu,Deep fake,deepfake video technology, technology,Rashmika, Rashmikas Deep Fake Video, internet by storm, celebrities in trouble, Rashmika Video, Zara Patel,Deepfake technology Latest News,deepfake technology Latest Updates,Rashmika Latest News,Rashmika Latest Updates
Deep fake , deepfake video technology, technology,Rashmika, Rashmika's Deep Fake Video, internet by storm, celebrities in trouble, Rashmika Video, Zara Patel

రెండు రోజుల నుంచి సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా  డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ గురించే  పెద్ద ఎత్తున  చర్చ జరుగుతోంది. సినీ నటి రష్మికకు సంబంధించిన  ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుండడంతో .. ఏంటీ డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీ ? దీని వల్ల నష్టం ఏంటి అంటూ నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. నేషనల్ క్రష్ ఇప్పుడు ఏఐ బాధితురాలిగా మారడంతో.. ఈ  విషయంపై ప్రభుత్వాలు, సెలబ్రెటీలు కూడా స్పందిస్తున్నారు.

రష్మిక మందన్నాను పోలినట్లు ఉన్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో  తాజాగా తెగ వైరల్ అయింది. బ్లాక్‌ జిమ్‌ డ్రస్‌లో ఉన్న రష్మిక లిప్టులోకి ఎంటరయి హాయ్ చెప్పడం పైగా ఎక్స్ పోజింగ్ డ్రస్ లో కనిపించడంతో రష్మిక ఇంత ఘోరంగా డ్రస్ వేసిందేంటా  అని చాలా మంది అనుకున్నారు. కానీ దీనిపై అది తాను కాదని  హీరోయిన్ రష్మిక, బాడీ తనదే కానీ ఫేస్ రష్మికది అని  సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ జారా పటేల్ వేరువేరుగా స్పందించి క్లారిటీ ఇవ్వడంతో.. ఇదొక ఫేక్‌ వీడియో అని అందరికీ అర్ధం అయింది.

ఈ వీడియోను.. డీప్‌ ఫేక్‌ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ ఆధారంగా రూపొందించినట్లు తేలింది. దీంతో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు..తెలంగాణ, కర్ణాటక  వంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై స్పందించాయి.   బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  ఏకంగా దీనిపై సైబర్ టీమ్‌‌కు  కంప్లైంట్ చేయగా, నాగచైతన్య వంటి కొంతమంది సెలబ్రిటీలు ఈ  ఫేక్ వీడియో విడుదలపై  ఖండించారు.

ఇంతకీ డీప్‌ ఫేక్‌ వీడియో టెక్నాలజీ అంటే ఏంటి అంటే..  డీప్‌ ఫేస్ టెక్నాలజీతో ఒక వ్యక్తి ముఖాన్ని మరో వ్యక్తి ముఖంగా మార్చేయొచ్చు. అంటే కేవలం ఫోటోలో వ్యక్తి ముఖమే కాదు.. వీడియోలో కనిపిస్తున్నవారి ఫేస్‌ను కూడా మరొక వ్యక్తి ముఖంగా  సెట్‌ చేయవచ్చు. ఇది ఒక రకమైన సింథటిక్‌ వీడియో అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ సాయంతో ఇలాంటి  వీడియోలను రూపొందిస్తున్నారు. ఏఐ సాయంతో నకిలీ వీడియోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అవతలి వ్యక్తి ప్రతిష్టను దిగజార్చుతున్నారు.

జారా పటేల్‌ అనే సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్  ముఖం ప్లేస్‌లో.. రష్మిక మందన్నా ఫేస్‌ను రీప్లెస్ చేసి  ఫేక్‌ వీడియోను తయారు చేసి వైరల్‌ చేశారు.అయితే ఈ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే లిఫ్ట్‌లోకి ఎంటర్‌ అవుతున్నప్పుడు మాత్రం  ఒరిజినల్‌ ఫేస్‌ అయిన జారా పటేల్ ఫేస్‌తోనే కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత వెంటనే ఫేస్‌ మారి రష్మికను చూపించారు.

నిజానికి ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక.. కొంతమంది ఈ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఏకంగా ప్రభాస్, అనుష్కకు పెళ్లి కూడా చేసేసి పిల్లలను కూడా క్రియేట్ చేసిన అత్యుత్సాహవంతుల గురించి మరిచిపోక ముందే..ఈసారి రష్మిక వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

సెలబ్రెటీలు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. వారి వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ..ఇలాంటివి క్రియేట్ చేసిన వాళ్లపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. అయితే అమ్మాయిలకు ఇది మైనస్ గా మారే అవకాశం ఉండటంతో.. దీని బారిన  పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పర్సనల్ ఫోటోలను డీపీలుగా పెట్టుకోవడం, సోషల్ మీడియాలో  పోస్ట్ చేయడం వంటివి చేయకూడదని  సూచిస్తున్నారు. ఒకవేళ ఫేస్ బుక్, ఇన్ స్టా, ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో మీ ఫోటోలను షేర్ చేసినా..  ప్రొఫైల్‌ను ప్రైవేట్‌గా పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − twelve =