బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ తో రేవంత్ రెడ్డి భేటీ, మార్చి తొలి వారంలో సభకు హాజరు

BKU Leader Rakesh Tikait, Congress MP Revanth Reddy, Congress MP Revanth Reddy Meets Farmers Union Leader, Farmers Union Leader, Ghazipur, Mango News, MP Revanth Reddy, MP Revanth Reddy Meets BKU Leader, MP Revanth Reddy Meets BKU Leader Rakesh Tikait, MP Revanth Reddy Meets Rakesh Tikait, MP Revanth Reddy suppport farmers protest at Delhi, Revanth meets Tikait, telangana

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపుగా 90 రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం నిర్వహిస్తున్న రైతుల సంఘాల నేతలను మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు కలిసి సంఘీభావం తెలియజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఘాజీపూర్ లో భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్ ‌ను కలిశానని, రైతు కూలీలు, రైతు సంఘాలు తన దృష్టికి తీసుకొచ్చిన విన్నపాలను టికాయిత్‌ కు వివరించానని చెప్పారు.

అలాగే అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు తను చేసిన రాజీవ్‌ రైతు భరోసా పాదయాత్ర, ఆర్ముర్ లో పసుపుబోర్డు సమస్య వివరాలను రాకేశ్‌ టికాయిత్ కు తెలియజేశానన్నారు. రైతు సంఘాల తరపున రాష్ట్రానికి రావాలని ఆయన్ను ఆహ్వానించానని, తెలంగాణలో మార్చి మొదటి వారంలో రైతు సంఘాలు ఏర్పాటు చేయబోతే బహిరంగ సభకు వస్తానని రాకేశ్‌ టికాయిత్ చెప్పారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సభ రాజకీయ పార్టీలకు అతీతంగా రైతుల హక్కులు కాపాడేందుకు నిర్వహించబడుతుందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − twelve =