రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.1200 వందలకు పెంచింది బీజేపీ సర్కారే – మంత్రి హరీష్ రావు

Munugode By-poll Minister Harish Rao Fires on BJP Politics in Telangana, Munugode By-poll, Minister Harish Rao Fires on BJP Politics, Harish Rao Comments on BJP Politics, Mango News, Mango News Telugu, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజీపీ దేశ ప్రజలకు చేసిందేమీ లేదని, ఇప్పుడు కొత్తగా మునుగోడుకు చేసేది కూడా ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని మన్నెగూడలో జరిగిన యాదవ-కురమ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. న్యాయం, ధర్మం వైపు నిలబడే జాతి గొల్ల కురమలని, అందుకే ఆనాడు కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పాండవుల వైపు నిలబడ్డాడని గుర్తు చేశారు. ఇక తెలంగాణలో గతంలో ఏ సీఎం చేయని విధంగా సీఎం కేసీఆర్ గొల్ల కురమల సంక్షేమానికి కృషి చేశారని, వారికి 75 శాతం సబ్సిడీతో గొర్రె పిల్లలు ఇచ్చిన ఏకైక సీఎం కూడా కేసీఆర్ మాత్రమేనని తెలియజేశారు. ఆర్థికంగానే కాకుండా, రాజకీయంగా ప్రభుత్వంలో, చట్టసభల్లో గొల్ల కురమలకు భాగస్వామ్యం కల్పించారని హరీష్ రావు కొనియాడారు.

ఇక కురమలకు, యాదవులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామని, మరో రెండు మూడు నెలల్లోనే అవి ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. గొల్ల కురమలు గొర్రెలు కొనుక్కోవడానికి ప్రభుత్వం వారి ఖాతాల్లో డబ్బులు వేయనుందని, వాటితో వచ్చే నెల ఐదో తేదీ తర్వాత మీకు నచ్చిన చోట గొర్రెలు కొనుక్కునే అవకాశం ఉందని ప్రకటించారు. ఇక రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.1200 వందలకు పెంచింది బీజేపీ సర్కారేనని, అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను కూడా ఇష్టానుసారం పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని విమర్శించారు. రైతుల బోర్లకు మీటర్లు పెడితే ఏడాదికి ఆరు వేల కోట్ల చొప్పున ఐదేళ్లకు 30 వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పినా సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదని, తన ప్రాణం పోయినా మీటర్లు పెట్టనిచ్చేది లేదని తెగేసి చెప్పారని మంత్రి హరీష్ రావు తెలిపారు. మునుగోడులో ఓట్ల కోసం ఆ పార్టీ ప్రజలను మభ్యపెడుతోందని, సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ప్రతి ఒక్కరూ నిలవాల్సిన సమయం ఇదేనని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 2 =