ఓరుగల్లులో గులాబీ బాస్ చూపు ఎవరి వైపు..!

Warangal Politics ,No ticket, Warangal sitting MP?,KCR,Loksabha, Parliament Elections, BRS, BRS Party, Lok Sabha polls, T.Rajaiah, Telangna BJP Party, YSRTP,TRS Party, Mango News Telugu, Mango News
Warangal Politics ,No ticket, Warangal sitting MP?,KCR,Loksabha, Parliament Elections

పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ.. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలో అభ్యర్థుల ఎంపికపై చేస్తున్న కసరత్తు స్పీడందుకుంది.  ముఖ్యంగా ఎస్సీ – ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో క్యాండిడేట్ల ఎంపికపై అన్ని పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎప్పుడూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే.. వరంగల్ లోక్ సభ స్థానంపైన ఎక్కువ ఫోకస్ పెంచాయి.

ఈసారి ఎలాగైనా ఓరుగల్లును మళ్లీ కైవసం చేసుకుని కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో  హస్తం పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జి కొండా సురేఖ..ఆ స్థానంలో తమ పార్టీ గెలుపు వ్యూహాలపై నాయకులతో కలిసి సమాలోచనలు జరుపుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాపై పట్టు సాధించడానికి ఉన్న ఏకైక మార్గం కాబట్టి.. ఎలాగైనా వరంగల్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. తమ పార్టీనుంచి బలమైన అభ్యర్థిని పోటీలోకి దింపే ప్రయత్నాల్లో నిమగ్నమయింది.

మరోవైపు ఇప్పటికే రెండు సార్లు వరుసగా గెలుస్తున్న గులాబీ పార్టీ హ్యాట్రిక్ విజయంపై ఫోకస్ చేసిందది.  బలమైన అభ్యర్థి ఎంపికపై పెద్ద ఎత్తు కసరత్తు చేస్తోంది. అయితే గత రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ గాలిలో అలవోకగా గెలిచిన  సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌ను.. ఈసారి గులాబీ బాస్ పక్కన పెడతారన్న ప్రచారం జరుగుతుంది. మరీ దయాకర్ స్థానంలో  బరిలోకి ఎవరు వస్తారో ..ఈ హట్ సీట్ ఎవరికి కట్టబెట్టబోతున్నారనే చర్చ కారు పార్టీలో జోరుగా కొనసాగుతోంది.

ప్రస్తుతం ఐదుగురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో  వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య, నర్సంపేట ఎమ్మెల్యే సతీమణి స్వప్న, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసి నాయకుడు జోరిక రమేష్, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజర్ కల్పన పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరిలో  కేసీఆర్ ఎవరికి టికెట్ ఇస్తారో  అన్నది ఆసక్తిగా మారింది.

అయితే, వీరిలో ఎవరిని నిలబెట్టినా కూడా ఎన్నికల ఖర్చు పార్టీ హై కమాండే భరించాల్సి వస్తుండడంతో వీరిలో బలమైన క్యాండిడేట్ ఎవరు? వరంగల్ ప్రజలు ఎవరి వైపున్నారు అనే దానిపైన పెద్ద ఎత్తున  సర్వేలు కొనసాగుతున్నాయట. దీంతో ఇంతకీ బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటుందా..అసలు ఓరుగల్లు వాసుల ఆశీర్వాదం ఎవరిపైన ఉంటుందో అన్న చర్చలు జోరందుకున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 7 =