మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటా

CM KCR Speech In Assembly, KCR Speech In Assembly, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Assembly Budget Session, Telangana Assembly Live 2019, Telangana Assembly Session 2019, Telangana Breaking News, Telangana CM KCR Speech In Assembly, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నాడు అసెంబ్లీలో మూడు గంటలపాటు సుదీర్ఘంగా ప్రసంగించి, కాంగ్రెస్, మజ్లీస్ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా యురేనియం త్రవ్వకాలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. నల్లమల అడవుల విషయంలో ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, యురేనియం త్రవ్వకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం అని చెప్పారు. మరో వైపు కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నారని దుష్ప్రచారం జరుగుతుంది, ఇక ముఖ్యమంత్రి పదవినుండి దిగిపోయి కుమారుడు కేటీఆర్ ను ఆ స్థానంలో కూర్చోబెడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి, అవన్నీ అబద్ధం తనకేమి కాలేదని కేసీఆర్ వివరించారు. తెరాస ప్రభుత్వం మరో మూడు సార్లు అధికారంలోకి వస్తుందని, కనీసం ఇంకో పదేళ్లయినా పనిచేయగలుగుతానని చెప్పారు. మరో రెండు పర్యాయాలు నేనే ముఖ్యమంత్రిగా చేస్తా అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.

సుదీర్ఘ ప్రసంగం చేసిన కేసీఆర్ పలు అంశాలపై వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వాహన చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేసారు. ఈ చట్టం పూర్తిగా అధిక జరిమానాలతో కూడి ఉందని తెలిపారు. సెప్టెంబర్ 17న ఎప్పటిలాగానే తెలంగాణ భవన్ పై జాతీయజెండా ఎగురవేస్తామని ప్రకటించారు. గతంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా జరపాలని తానుకూడ కోరుకున్నానని, అయితే మేధావులు సూచన మేరకు సంక్లిష్టమైన పాత విషయాలను ప్రేరేపించడం సబబు కాదనుకునట్టు తెలిపారు. తెలంగాణకు నిజమైన విముక్తి లభించింది 2014 జూన్ 2న మాత్రమే అని పేర్కొన్నారు.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here