జీహెఛ్ఎంసీ, న‌గ‌ర ప‌రిస‌ర మున్సిపాలిటీల్లో వీధి కుక్క‌ల బెడ‌ద‌ నివారణకై యుద్ద‌ప్రతిపాదికన చ‌ర్య‌లు: అర‌వింద్ కుమార్

Special Chief Secretary Arvind Kumar held High Level Meeting on Controlling of Stray Dogs Menace in GHMC Limits,Special Chief Secretary Arvind Kumar,Held High Level Meeting,Controlling of Stray Dogs Menace,GHMC Limits,Mango News,Mango News Telugu,GHMC Latest News And Updates,GHMC News And Live Updates,GHMC Property Tax,GHMC Property Tax news,GHMC Commissioner,Greater Hyderabad Municipal Corporation,Greater Hyderabad Municipal Corporation News

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెఛ్ఎంసీ), న‌గ‌ర ప‌రిస‌ర మున్సిపాలిటీల పరిధిల్లో వీధి కుక్క‌ల బెడ‌ద‌ను నివారించ‌డానికి యుద్ద‌ప్రాతిప‌థిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ మున్సిప‌ల్ అధికారుల‌ను ఆదేశించారు. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. బుధ‌వారం మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ కార్య‌ల‌యంలో జ‌రిగిన ఉన్న‌త స్థాయి స‌మావేశంలో మున్సిప‌ల్ శాఖ కార్య‌ద‌ర్శి సుద‌ర్శ‌న్ రెడ్డి, జీహెఛ్ఎంసీ క‌మీష‌న‌ర్ లోకేష్ కుమార్‌, మున్సిప‌ల్ ప‌రిపాల‌న డైరక్ట‌ర్ స‌త్య‌నారాయ‌ణ, జీహెఛ్ఎంసీ జోన‌ల్ క‌మీష‌న‌ర్లు,జీహెఛ్ఎంసీ వెట‌ర్న‌రీ విభాగం అధికారులు పాల్గొన్నారు. జీహెఛ్ఎంసీ ప‌రిధిలో ప్ర‌స్తుతం ఐదున్న‌ర ల‌క్ష‌ల వీధి కుక్క‌లున్నాయ‌ని, గ‌తంలో 8 ల‌క్ష‌ల 50 వేల ఉండేవ‌ని (2011) స్టెరిలైజేష‌న్ ఆప‌రేష‌న్స్ నిర్వ‌హించ‌డం వ‌ల్ల‌న వాటి సంఖ్య 5 ల‌క్ష‌ల 50 వేల‌కు త‌గ్గింద‌ని తెలిపారు. వాటికి వెంట‌నే ఎబిసి (యానిమల్ బర్త్ కంట్రోల్) స్టెరిలైజేష‌న్ ఆప‌రేష‌న్లు నిర్వ‌హించాల‌ని, ఆయా కాల‌నీల‌ల్లో కొన్ని వాట‌ర్ పాయింట్స్ (నీటి నిల్వ స‌దుపాయం) ను కూడా ఏర్పాటు చేయాల‌ని అరవింద్ కుమార్ ఆదేశించారు.

జీహెఛ్ఎంసీ ప‌రిధిలో ఉన్న హోట‌ల్స్‌, రెస్టారెంట్స్, ఫంక్ష‌న్ హాల్స్‌, చికెన్ సెంట‌ర్స్‌, మ‌ట‌న్‌ సెంట‌ర్లు వ్య‌ర్థ‌ప‌దార్థాల‌ను వీధుల్లో వేయ‌కుండా క‌ట్ట‌డి చేయాల‌ని మున్సిప‌ల్ అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చారు. న‌గ‌రంలో వీధి కుక్క‌లు, వాటి మూలంగా సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున వాటిని నిరోధించ‌డానికి త‌గిన చ‌ర్య‌లు చేపట్టాల‌ని ఆదేశించారు. న‌గ‌రంలోని ప్ర‌భుత్వ, ప్రైవేట్ పాఠ‌శాల‌లో విద్యార్థులకు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌న్నారు. పాఠ‌శాల విద్యార్థులకు పెంపుడు కుక్క‌ల గురించి అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో వాటిన బారిన ప‌డుతున్నార‌ని, దీనిని నియంత్రించ‌డానికి విద్యార్థుల‌కు కూడా స‌రైన అవ‌గాహ‌న పెంపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. దీనికి సంబంధించిన క‌ర‌ప‌త్రాలు, హోర్డింగ్స్ సిద్దం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు.

న‌గ‌ర మ‌రియు మున్సిపాలిటీల ప‌రిధిల‌ల్లో ఉన్న స్ల‌మ్‌డెవ‌ల‌ప్‌మెంట్‌ ఫెడ‌రేష‌న్స్‌, టౌన్ డెవ‌ల‌ప్‌మెంట్‌ ఫెడ‌రేష‌న్స్‌, రెసిడెంట్ కాల‌నీ వెల్ఫెర్ అసోసియేష‌న్స్ స‌హ‌కారంతో నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. రాష్ట్రంలో ఉన్న ఇత‌ర మున్సిపాలిటీలల్లో మోప్మా స్వ‌యం స‌హాయ‌క బృందాల‌తో నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చారు. పెంపుడు జంతువుల న‌మోదు గురించి కూడా ఒక ప్ర‌త్యేక మోబైల్ యాప్ ను సిద్ధం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. వీటి సంబంధించిన ఫిర్యాదుల‌ను (MY GHMC) మై జీహెఛ్ఎంసీ యాప్ నెంబ‌ర్ 040-21111111 ద్వారా న‌మోదు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. న‌గ‌ర ప‌రిధిలో, ప‌రిస‌ర మున్సిపాలిటీల ప‌రిధిలో పెంపుడు కుక్క‌ల సంఖ్య‌ను గుర్తించ‌డానికి త్వ‌ర‌లో మోబైల్‌ యాప్ ను కూడా రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. ఆ యాప్‌లో సంబంధిత య‌జ‌మానులు న‌మోదు చేసుకోవాల‌ని త‌ద్వారా ఒక గుర్తింపు కార్డును కూడా మంజూరు చేయ‌నున్నామ‌ని పేర్కొన్నారు. ఎక్కువ‌గా కేసులు న‌మోదౌతున్న ప్రాంతాల‌ను గుర్తించి, అక్క‌డ త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన్నారు. ఆ ప్రాంతాల్లో వెట‌ర్న‌రీ బృందాల‌ను త‌ర‌లించి వాట‌ని క‌ట్ట‌డి చేయ‌డానికి త‌గు చ‌ర్య‌లు చేపట్టాల‌ని, మూసి ప‌రివాహ‌క ప్రాంతంలో కూడా ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని అరవింద్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 6 =